Begin typing your search above and press return to search.

ప‌వ‌నూ మీకు ప్ర‌జ‌ల గ‌ళం వినిపిస్తోందా...!

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:30 AM GMT
ప‌వ‌నూ మీకు ప్ర‌జ‌ల గ‌ళం వినిపిస్తోందా...!
X
ఎందుకంటే.. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల‌కు అభిమానం ఉండొచ్చు.. కానీ, రాజ‌కీయంగా ఆయ‌న‌ను న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఏపీలో ప‌ట్టు మని ప‌ది రోజులు ఉన్న ప‌రిస్థితి లేదు. ఏ స‌మ‌స్య‌పైనైనా ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు ఆందోళ‌న చేసింది కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, ప్ర‌జ‌ల్లోకి ఇలా వ‌స్తున్నా.. అలా వెంట‌నే ఆయ‌న వెళ్లిపోతున్నారు. సో.. దీనిని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నార‌నేది ప‌రిశీలకుల మాట‌. ఆరోజైనా.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల్లో ఉండి పాద‌యాత్ర చేసినందుకే.. ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఇప్పుడు ప‌వ‌న్‌ను ఎలా న‌మ్మాలి? అనేది ప్ర‌శ్న‌.

ఇటీవ‌ల జ‌రిగిన ఇప్ప‌టం వ్య‌వ‌హారం.. చాలా హీట్ పుట్టించింది. ఇక్క‌డ ప‌వ‌న్ ప‌ర్య‌టించారు కూడా. అయితే, ఆయ‌న అక్క‌డ స్పెండ్ చేసిన స‌మ‌యం కేవ‌లం 2 గంట‌లు. మ‌ధ్యాహ్నం.. 1 గంట‌క‌ల్లా.. ఆయ‌న జంప్ అయిపోయారు. త‌ర్వాత‌..ప‌వ‌న్ వ‌చ్చాడ‌ని తెలిసి.. చుట్టుప‌క్క‌ల ఉన్న గ్రామాల ప్ర‌జ‌లు ఆయ‌న‌కు త‌మ బాధ‌లు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించారు.

కానీ,ఆయ‌న వెళ్లిపోవ‌డంతో వెనుదిరిగి ఉసూరు మంటూ వెళ్లిపోయారు. ఇలాంటి ఘ‌ట‌న లు చాలానే ఉన్నాయి. దీంతో ప‌వ‌న్‌పై న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌జ‌లు ఎవ‌రిని నాయ‌కుడిగా కోరుకుంటారు? అనేది పెద్ద టాస్క్‌. అనుభ‌వం, విజ‌న్ ఉన్న నాయ‌కుల‌కే ప‌ట్ట గ‌డ‌తారు.. అని అనుకుంటే.. రెండో సారి కూడా చంద్ర‌బాబు గెలిచి ఉండాలి. కానీ, ఆ పార్టీ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయింది. అదేస‌మ‌యంలో ఎలాంటి అనుభ‌వం లేని వైసీపీ అధినేత‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. 151 సీట్ల‌తో గెలుపు గుర్రం ఎక్కించారు. అంటే.. ఏపీ ప్ర‌జ‌లు ఏదో కోరుకుంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వారిలో ఏదో ఆశాభావం ఉంది. దీనిని సాకారం చేసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు.

అందుకే గ‌తంలో ప్రత్యేక ప్యాకేజీని ప‌వ‌న్‌.. `పాచిపోయిన ల‌డ్డూ` అని కామెంట్లు చేస్తే.. ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌, ప్ర‌త్యేక హోదా కోసం.. నేను నిల‌బ‌డ‌తాను.. అంటే.. కూడా అదే రెస్పాన్స్ క‌నిపించింది. దీనిని బ‌ట్టి.. ప్ర‌జ‌లు ఏపీకి సంబంధించి ఒక విధ‌మైన ఆలోచ‌న‌లో ఉన్నారు.

మ‌రి వారి నాడిని ప‌ట్టుకుని ముందుకు సాగితేనే త‌ప్ప‌.. ప‌వ‌న్‌కు ఛాన్స్ ల‌భించ‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్తూ.. ప‌ల‌క‌రింపుల‌కే ప‌రిమిత‌మైతే.. ప‌వ‌న్‌ను ఎలా న‌మ్మాల‌నే ప్ర‌జ‌ల గ‌ళాన్ని ప‌వ‌న్ వినిపించుకుంటేనే ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.