Begin typing your search above and press return to search.
సీఎం ఎమ్మెల్యే పోస్టు పాయే.. కుర్చీ కాపాడుకునేదెట్ల?
By: Tupaki Desk | 26 Aug 2022 2:35 PM GMTకేంద్రంలోని మోడీ సర్కార్ ను ఎదిరిస్తే.. ఆయనను ధిక్కరిస్తే ఏమవుతుందో దేశంలోని ప్రతిపక్షాలకు బాగా అర్థమవుతోంది. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రినే ఈడీ కేసుల్లో ఇరికించి ముప్పు తిప్పలు పెడుతున్న మోడీ సర్కార్.. తోక జాడించే ప్రాంతీయ పార్టీలను వదలుతుందా? అందుకే అదునుచూసి దెబ్బకొడుతోంది.
ఇప్పటికే మహారాష్ట్రలో తమను చీట్ చేసిన శివసేనను చావుదెబ్బ తీసిన బీజేపీ.. అనంతరం జార్ఖండ్ పై పడింది.అక్కడ అధికారంలోకి రావడానికి ఉన్న లూప్ హోల్స్ అన్నీ వెతికి మరీ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టింది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు తాజాగా షాక్ తగిలింది. తనకు తానే గనులను కేటాయించుకొని అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే పదవి హోదా కోల్పోయారు.
శాసనసభ సభ్యత్వం కోల్పోయిన సోరెన్ 6 నెలల లోపు మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. లేదంటే సీఎం కుర్చీకి రాజీనామా చేయాలి. సో ఎన్నికలు పెట్టడం.. పెట్టకపోవడం కేంద్రం చేతుల్లో పని.. గెలిస్తేనే మళ్లీ సీఎంగా సోరెన్ కు అవకాశం. దీంతో ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది సోరెన్ పరిస్థితి.
జార్ఖండ్ లో బీజేపీని ఓడించిన జేఎంఎం నేత సోరెన్ అక్కడి కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేఎంఎంకు 30 మంది, కాంగ్రెస్ కు 17 మంది, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 26మంది ఎమ్మెల్యేలున్నారు.
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డ 22 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో 5 ఏళ్లు పాలిచిన సందర్భాలు లేవు. 11 మంది సీఎంలు ఇలా మధ్యలోనే దిగిపోయారు. అంతటి అనిశ్చితి రాష్ట్రంలో మరోసారి సీఎం సీటుకు ఎసరు వచ్చింది. ఈసారి బీజేపీ తీసుకొచ్చింది. మరి సోరెన్ కుర్చీ కాపాడుకుంటాడా? లేదా? అన్నది చూడాలి