Begin typing your search above and press return to search.
కేసీయార్ జాతీయ ఉత్సాహం... అలాగే కానీయ్...!
By: Tupaki Desk | 18 Jan 2023 4:57 PM GMTఇంటికి ఎవరినైనా అతిధులుగా పిలిస్తే వస్తారు. వచ్చిన వారు మర్యాదకో మొహమాటానికో నాలుగు మంచి మాటలు చెబుతారు. కాస్తా స్వరం పెంచి ఇంద్రుడివి చంద్రుడివి అని కూడా అంటారు. అంత మాత్రం చేత ఉన్న విలువ అలాగే ఉంటుంది కానీ కొత్తగా వచ్చి చేరేది ఏముంటుంది. టీయారెస్ లో ఒక అక్షరాన్ని చెరిపేసి పక్కన బీ తెచ్చేసినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
కేసీయార్ మంచి వ్యూహకర్తే. నో డౌట్. కానీ ఆయన పొలిటికల్ కాన్వాస్ తెలంగాణా వంటి పరిమిత ప్రాంతం లాంటిదైతేనే ఫలితం కనిపిస్తుంది. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా ఉన్నవి ఉన్నాయి. మరి వాటితో పోలిస్తే పదిహేడు సీట్లను పెట్టుకుని కేసీయార్ ఢిల్లీకి రాజుని అవుతాను అంటే ఆవులిస్తూ అక్కడ కూర్చుకునేది ఎవరు అన్నదే చర్చ.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసీయార్ సభకు వచ్చారు. ఎలా ఆయన తనతో పాటు మరో సీఎం ని కూడా తన పార్టీ వారినే వెంట పెట్టుకుని మరీ. ఆయన దర్జా అది. పైగా ఓటమి లేకుండా మూడు సార్లు ఢిల్లీకి సీఎం గా ఉన్నారు. ఉత్తరాదివారు ప్రధాని కేంద్ర మంత్రులు ఉన్న చోటనే పాలిస్తున్న వారు ఆ క్రేజ్ అలాంటిది కాబట్టే ఆప్ కి వాల్యూ ఎక్కువ.
ఆయన దేశంలో తన పార్టీని అన్ని చోట్లా పోటీ చేయిస్తూ విస్తరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే కేసీయార్ ని మాటవరసకు పెద్దన్న అన్నారు కానీ జాతీయ రాజకీయాల్లో ఆయనే ఈ రోజు పెద్దన్నగా ఉన్నారు. ఇక అఖిలేష్ యాదవ్ తీసుకుంటే 80 ఎంపీ సీట్లు ఉన్న అతి పెద్ద స్టేట్ నుంచి వచ్చారు. అంటే తెలంగాణాకు అయిదు రెట్లు ఎక్కువ అన్న మాట. అలాంటి అఖిలేష్ యాదవ్ కి కూడా సీట్లు ఎక్కువ వస్తే ప్రధాని కావాలని ఉంది. ఆయన కేసీయార్ తనకు సాయంగా ఉంటారనే వచ్చారు తప్ప బీయారెస్ పల్లకీ మోయడానికి కానే కాదు అని అంటున్నారు.
ఇల లెఫ్ట్ పార్టీల తీరు చూసుకుంటే వారి లెక్కలు వేరేగా ఉంటాయి. జాతీయ స్థాయిలో బలంగా ఫ్రంట్ కట్టాలీ అంటే కచ్చితంగా కాంగ్రెస్ జట్టు ఉండాలనే వారు కోరుకుంటారు. కాంగ్రెస్ కే అలా ప్రాధాన్యత ఇస్తారు. వారు బీజేపీని ఎవరు తిట్టినా వస్తారు. అలా వచ్చిన వారిని కలుపుకుని యాంటీ ఫ్రంట్ కట్టాలన్నదే వారి కోరిక. ఇలా కేసీయార్ ఖమ్మం సభకు వచ్చిన వారు తలో ఆలోచనతో వచ్చారు అని అనుకోవాల్సి ఉంటుంది.
కేసీయార్ ఖమ్మంలోనే ఇప్పటిదాకా టీయారెస్ కి సరైన విజయం తీసుకుని రాలేదు. ఇక బీయారెస్ ని దేశంలో ఎక్కడ విస్తరించి జాతీయ పార్టీ అనిపిస్తారు అన్నది కూడా ఉంది. కేసీయార్ ఆలోచనలు తెలంగాణా వరకూ సక్సెస్ కానీ దేశ రాజకీయాల్లో ఇపుడున్న పరిస్థితుల్లో అయితే కానీ కావు అని అంటున్నారు. ఇక కేసీయార్ కూడా ఇవన్నీ తెలియని వారు కారు. ఆయన జాతీయ నాయకుడుని అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారు.
రేపటి రోజున తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ మరోమారు తన పార్టీ గెలిస్తే ఇక కాంగ్రెస్ తో లోకల్ వైరం పోతుంది. దాంతో మంచి టైం చూసి కాంగ్రెస్ తో జట్టు కట్టి బీయారెస్ చక్రాలను ఆ బండిని తగిలించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కేసీయార్ ఇపుడు రాజకీయ ఉత్సహంతో ఉన్నారు. అది 2024 దాకా సాగుతుంది ఫలితాలు మాత్రం ఇపుడే ఎవరూ అడగకూడదు, చెప్పకూడదు, ఎందుకంటే గులాబీ బాస్ ఉత్సాహం అలా మరో ఏణ్ణర్ధం పాటు అలా సాగిపోవాల్సిందే కదా. అందుకు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.