Begin typing your search above and press return to search.

కేశినేని జంపింగ్‌కు ముహూర్తం ఫిక్స‌యిందా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 2:30 AM GMT
కేశినేని జంపింగ్‌కు ముహూర్తం ఫిక్స‌యిందా?
X
టీడీపీలో కీల‌క నాయ‌కుడిగా.. క‌మ్మ వ‌ర్గానికి చెందిన నేత‌గా.. పేరున్న విజ‌య‌వాడ ఎంపీ.. కేశినేని నాని.. త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం రెడీ అయింద‌నే ప్ర‌చారం విజ‌య‌వాడ రాజ‌కీయా ల్లో జోరుగా సాగుతోంది. అయితే.. దీనిపై నాని అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌డం లేదు.

కానీ.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న జంప్ చేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. 2014కు ముందు.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న నాని.. ఆ ఎన్నిక‌ల్లో ఎంపీ సీటును ద‌క్కించుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత‌.. ఎన్నిక‌ల్లోనూ అంటే.. 2019లో ఆయ‌న టీడీపీ త‌ర‌పున గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ విజ యంపై ఆయ‌న ఆస‌క్తికర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ``నేను సొంత‌గానే గెలిచాను. చంద్ర‌బాబు ఇమేజ్‌తో గెలిచార‌నే కుక్క‌ల‌కు నేను ఒక్క‌టే చెబుతున్నాను. జిల్లాలో 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఆయ‌న ఇమేజ్ ఉంటే.. అక్క‌డ ఎందుకు టీడీపీ ఓడిపోయింది. పోనీ.. మ‌చిలీప‌ట్నంలో ఎందుకు గెల‌వ‌లేదు?`` అని విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక,అప్ప‌టి నుంచి టీడీపీకి.. ఆయ‌న‌కు మ‌ద్య గ్యాప్ పెరుగుతోంది.దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇదిలావుంటే.. ఆయన‌కు.. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి మ‌ధ్య స్నేహం ఉంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబుకూడా చెప్ప‌కుండా.. తాను రెండో సారి గెలిచిన త‌ర్వాత‌.. నేరుగా గ‌డ్క‌రీ వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు గ‌డ్క‌రీ సూచ‌న‌ల మేర‌కు కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మాన‌సికంగా రెడీ అయ్యార‌నిఅంటున్నారు.

ఈ నెల 29న ఆయ‌న బీజేపీ లో చేర‌నున్నార‌ని కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌తో పాటు.. ఆయ‌న కుమార్తె.. ఇటీవ‌లే వివాహం అయిన‌.. కార్పొరేట‌ర్ కేశినేని శ్వేత‌కూడా బీజేపీ కండువా క‌ప్పుకొంటార‌ని టీడీపీ నేత‌లే ఆఫ్ దిరికార్డుగా చెబుతున్నారు. ఆమెను తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నానీ .. య‌థ‌ప్ర‌కారం.. విజ‌య‌వాడ ఎంపీగా బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు.. త‌ప్పు కూడా కాదు.. సో.. ఏదైనా జ‌రగొచ్చ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.