Begin typing your search above and press return to search.
సింగరేణిపై లేని అధికారం.. విశాఖ పై ఉందా కిషన్‌జీ!!
By: Tupaki Desk | 11 Dec 2022 2:30 AM GMTఒక విషయం..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ(ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) పూర్తిగా కేంద్ర ప్రభుత్వ రంగం కార్పొరేషన్. దీనిని 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఉద్యమాలు జరిగాయా.. ఎంతో మంది మరణించారా.. కొంత సింపతీ.. మరికొంత జాలి.. ఇవన్నీ పక్కన పెడదాం. ఇతమిత్థంగా విశాఖ ఉక్కు.. కేంద్రానికి చెందిందే!!
రెండో విషయం..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న సింగరేణి బొగ్గు కంపెనీ కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఇది కూడా కార్పొరేషనే. దీనిని బ్రిటిషర్స్ కాలంలో 1920లో ఏర్పాటు చేశారు. తర్వాత.. దీనికి కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. అదే నిర్వహిస్తోంది. ఇక్కడ నుంచి ఏ చిన్న పాటి బొగ్గు ముక్క బయటకు రావాలన్నా..కేంద్రం అనుమతి ఉండాల్సిందే.(మైనింగ్ శాఖ)
అసలు విషయం..
ఇక, అసలు విషయానికి వస్తే.. ఏపీలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు కేంద్రానికి హక్కులు ఉన్నాయని కేంద్ర సచివులు పదే పదే చెబుతున్నారు. అదేసమయంలో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గని ని ఏం చేసేందుకూ తమకు ఎంత మాత్రం హక్కులు లేవని చెబుతున్నారు. దీనిని ప్రైవేటీకరణ చేయాలని కాదు.. కార్మికుల కడుపుకొట్టాలని కాదు. కానీ, కేంద్ర ద్వంద్వ విధానాలు, రెండు నాల్కల ధోరణిని మాత్రం మనం చర్చించుకుంటున్నాం.
రెండూ కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలే అయినప్పుడు.. ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నప్పుడు.. ఇలా.. ఒక విశాఖ విషయంలో ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం.. రెండు సింగరేణి విషయంలో ఇలా వ్యాఖ్యానించడం ఏమేరకు సబబు ? అనేది ప్రశ్న.
తాజాగా కిషన్ రెడ్డి ఏం చెప్పారు?
సింగరేణిని ప్రైవేటీకరణ చేయడంలేదని మోడీనే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కొందరు కావాలనే విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదన్నారు. అభద్రతాభావంతోనే కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తోందన్నారు. యూపీఏ హయాంలో రూ.1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బొగ్గు బ్లాక్‌ల వేలంలో పారదర్శకత ఉండేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే..
బీజేపీకి కావాల్సింది.. అధికారం. ఇది దక్కుతుంది.. అని ఏమాత్రం ఉప్పందినా..అక్కడ చేసే రాజకీయం.. ఇలానే ఉంటుంది. తమకు అవసరం లేదని అనుకున్న రాష్ట్రాన్ని తాకట్టుపెట్టేందుకు, అప్పులు మయం చేసేందుకు మోడీ సర్ ఏమాత్రం వెనక్కి తగ్గరని మరోసారి రుజువు అయిందన్నమాట. ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.