Begin typing your search above and press return to search.

అదే తమాషా : మళ్ళీ మంత్రులుగా ఇద్దరు నానీలు...?

By:  Tupaki Desk   |   10 Sep 2022 12:30 AM GMT
అదే తమాషా : మళ్ళీ మంత్రులుగా ఇద్దరు నానీలు...?
X
ఏపీలో వైసీపీ రాజకీయాల‌లో కొత్త తమాషాను చూడబోతున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరిగి అయిదు నెలల తరువాత మాజీలకు మళ్లీ ఆశల రెక్కలు వచ్చాయి. అందరి కంటే ముందు వరసలో ఇద్దరు నానీలు ఉన్నారని టాక్. ముఖ్యంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన పేర్ని నాని, కొడాలి నాని ఒక్క నెల ఆగితే మినిస్టర్స్ గా దర్శనం ఇస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగిపోతోంది.

దానికి సంకేతంగా రాజకీయ పరిణామాలు కూడా చకచకా సాగిపోతున్నాయి. నిన్నటికి నిన్న పేర్ని నాని తాడేపల్లి పార్టీస్ కి వచ్చి గంటకు పైగా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన చంద్రబాబు సహా దుష్టచతుష్టయాన్ని ఏ మాత్రం వదలకుండా గట్టిగానే ఇవ్వాల్సింది ఇచ్చుకున్నారు. వైసీపీ హై కమాండ్ ఏదైతే కోరుకుంటుందో ఆ రకంగా పేర్ని నాని ప్రెస్ మీట్ మొత్తం సాగింది అని అంటున్నారు.

ఇక వైసీపీలో ఆరు నెలలుగా ఉన్న రాజకీయ స్తబ్దతను అయితే ఒక్క ప్రెస్ మీట్ తో పేర్ని నాని బద్ధలుకొట్టారనే ఫీడ్ బ్యాక్ వచ్చింది అంటున్నారు. పేర్ని నాని అంటే మాటకారి. వెటకారం డాట్ కామ్ కి కేరాఫ్ అడ్రస్. ఆయన పంచులు మామూలుగా ఉండవు. అవతల వారు తన గొంతు తామే పట్టుకోవాలనిపించేలా ఇరిటేషన్ తెప్పించేలా ఆయన సెటైర్లు ఉంటాయి. మొత్తానికి పేర్ని నాని మెయిన్ లైన్ లోని వచ్చేశారు. మునుపటి జోష్ తో కూడా కనిపించారు

ఇక ఇవాల్టికి ఇవాళ కొడాలి నాని కూడా బిగ్ సౌండ్ చేశారు. విశాఖే మన పరిపాలనా రాజధాని, ఇది తధ్యమని సత్యమని కూడా చెప్పేశారు. పనిలో పనిగా చంద్రబాబు మీద ఆయన మాటల దాడి చేశారు. దానికంటే ముందు కొడాలి నాని గడప గడపకు ప్రొగ్రాం లో జగన్ ఫ్యామిలీ జోలికొస్తే అసలు బాగోదు అంటూ టీడీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తూంటే ఇద్దరు నానీలు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశారు అంటున్నారు.

ఒక వైపు కొత్త మంత్రుల పనితీరు బాగాలేదని, విపక్షాల మీద కూడా గట్టిగా నోరు చేసుకోవడం లేదని వైసీపీ హై కమాండ్ తెగ మధనపడుతోంది అన్న వార్తలు వచ్చాయి. మంత్రి వర్గ సమావేశంలో జగన్ మంత్రుల పనితీరు మీద సమీక్ష చేపట్టారు అని అంటున్నారు. తీరు మారకపోతే సీటు గల్లంతు అని కూడా చెప్పేశారని వార్తలు వచ్చారు. ఇక నవంబర్ లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అని కూడా ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్ పనితీరు అసంతృప్తిగా ఉన్నట్లుగా నివేదికలు ఉన్నాయి.

పైగా ఆయన సొంత సీట్లో కూడా గెలుపు డౌట్లో ఉందిపుడు. ఈ నేపధ్యంలో ఈ జిల్లాలో మళ్ళీ ఇద్దరు నానీలను తీసుకుని అటు పార్టీకి ఇటు సర్కార్ కి ఫుల్ సౌండ్ తో పాటు విపక్షానికి బ్యాండ్ బాజా మోగించాలని హై కమాండ్ ఆలోచిస్తోంది అంటున్నారు. మొత్తానికి ఈ వార్తలు కనుక నిజమైతే మాత్రం ఇద్దరు నానీలూ మినిస్టర్ కుర్చీ ఎక్కేసినట్లే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.