Begin typing your search above and press return to search.
కొడాలి నానికి నో ఆప్షన్... అందుకే అలా...?
By: Tupaki Desk | 23 Sep 2022 2:30 AM GMTవైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన మాజీ మంత్రి కొడాలి నాని ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. దానికి కారణం ఆయన దూకుడే అని చెప్పాలి. మంత్రిగా మూడేళ్ల పదవీకాలంలో ఆయన జగన్ వైపు గట్టి మద్దతుదారుగా ఉండి టీడీపీ మీద దారుణంగా విరుచుకుపడ్డారు. రాజకీయ పరిభాష దాటి మరీ వ్యక్తిగత భాషను వాడేశారు. హద్దులు కూడా బద్దలు కొట్టి ఎంత ముందుకు వెళ్లాలో అంతలా వెళ్లారు. దాంతో ఏపీలో రాజకీయం పూర్తిగా మారిపోయింది.
నిజానికి నాటి నుంచే అటూ ఇటూ కూడా నేతలు బూతులు మాట్లాడడం మొదలెట్టారు. ఫలితంగా ఏ పాపమూ ఎరగని ఇంట్లో ఆడవారు కూడా బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే మంత్రిగా తనను అయిదేళ్ల పాటు జగన్ కంటిన్యూ చేస్తారని కొడాలి నాని భావించే బాగా నోటికి పని చెప్పారని అంటారు. అయితే జగన్ తనదైన రాజకీయ వ్యూహాలతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొడాలికి ఎవరూ ఊహించని విధంగా చెక్ చెప్పి భారీ షాక్ ఇచ్చేశారు.
ఆ తరువాత కొడాలి కొన్నాళ్ళ పాటు సైలెంట్ అయినా కూడా మళ్లీ ఈ మధ్య దూకుడు స్టార్ట్ చేశారు. నవంబర్ లో మంత్రి వర్గంలో మార్పుచేర్పులు ఉంటాయన్న ఉద్దేశ్యంతో నాని మునుపటి ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు అని చెబుతున్నారు. అయిదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అమరావతి రాజధాని ఇష్యూ మీద నాని మరోసారి మాట్లాడి ఉద్యమాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అంతే కాదు మద్దతుగా వచ్చిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని కూడా విమర్శించారు.
అది జరిగిన మూడు రోజులకే ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ పేరుని మార్చేస్తూ జగన్ సర్కార్ డెసిషన్ తీసుకుంది. దాంతో నాని అదే శాసనసభలో ఉన్నా ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఒక రకంగా కొడాలి అవాక్కు అయ్యారని కూడా చెబుతారు. నిజానికి ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని జగన్ కి విజ్ఞప్తి చేశారు కానీ కొడాలి నాని ఆ పని కూడా చేయలేదు.
ఆయనకు ఇపుడు ఏమి చేయాలో కూడా అర్ధం కాలేదని అంటున్నారు. ఆయన రాజకీయం పూర్తిగా వన్ సైడెడ్ గా చేసుకున్నారని అంటున్నారు. నో ఆప్షన్ అన్నట్లుగా నాని రాజకీయ కధ ఉంది. ఆయన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లని చాలా ఎక్కువగా హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. దాంతో ఆయనకు రాజకీయంగా వేరే మార్గాలు లేకుండా పోయానని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి పేరు మార్పు మీద వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయగలరా అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నిస్తున్నారు. మౌనంగా ఉండడం కాదు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కొడాలి నాని పూర్తిగా కార్నర్ అవుతున్నా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు.
మరి ఈ ఫైర్ బ్రాండ్ నోరు ఎపుడు విప్పుతుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. బహుశా నవంబర్ దాకా ఆగి ఆ మీదట ఆయన పెదవి విప్పుతారు అని అంటున్నారు. మరి అప్పటికి మంత్రివర్గంలో మార్పుచేర్పుల కధ ఏంటో చూశాకే కొడాలి రెండవ వైపు ఏంటో చూపిస్తారా అన్న చర్చ అయితే ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.