Begin typing your search above and press return to search.
తమ్ముడు రాజగోపాల్ రెడ్డితోపాటు వెంకటరెడ్డి జంప్ యేనా?
By: Tupaki Desk | 5 Aug 2022 1:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ హాట్ టాపిక్ గా మారారు. అన్నాదమ్ములు వేర్వేరు అంటూనే కేంద్రంలోని పెద్దాయన అమిత్ షాను వేర్వేరుగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు ఆయన తమ్ముడు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి సైతం భేటి అయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా కలిసి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను కలిసింది కేవలం తెలంగాణకు రూ.1000 కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే హోంమంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. పైకి అభివృద్ధి అంటున్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్న నేపథ్యంలో కలవడంతో అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. పైగా రేవంత్ రెడ్డితో పంచాయితీ పెట్టుకొని బీజేపీ పెద్దను కలవడంతో ఆయనను ఎవరూ నమ్మని పరిస్థితి నెలకొంది.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని.. నన్ను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నాడని తెలిపారు. నా లోక్ సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్ ఎలా మీటింగ్ పెడుతాడని.. లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
పాంత కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లను చేర్చుకుంటారా? అని ప్రశ్నించారు.
ఇక తొలుత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక తేదీపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఢిల్లీ బీజేపీ పెద్దలను కలవడానికి వెళ్లాడు. ఈయన తర్వాత అన్న వెంకటరెడ్డి కలవడంతో తమ్ముడుతోపాటు అన్న కూడా బీజేపీలో చేరిపోతాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అమిత్ షాను కలవడంతో పార్టీ మార్పుపై వచ్చిన వార్తలను కోమటిరెడ్డి బయటపెట్టారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు అని.. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళతానని అన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడో సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.