Begin typing your search above and press return to search.
ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానంటున్న వైఎస్సార్సీపీ బహిష్కృత నేత!
By: Tupaki Desk | 15 Aug 2022 4:30 PM GMTకొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేత. గతంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన సందర్భంగా నర్సాపురం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయాలని గట్టిగా పోరాడారు. అయితే జగన్ ప్రభుత్వం భీమవరంను జిల్లా కేంద్రంగా ఎంపిక చేసింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు జగన్ ప్రభుత్వంపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముదునూరి ప్రసాదరాజును నరసాపురం ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నారు.
ఈ వ్యవహారంపైన ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం కొత్తపల్లి సుబ్బారాయుడిని ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి అంటే గత మూడు నెలలుగా ఆయన స్థబ్దుగా ఉంటున్నారు. స్థానికంగా పెళ్లిళ్లు, పలకరింపులు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వంటి కార్యక్రమాలకే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందనేదానిపై అనుచరులతో చర్చించారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానన్నారు.
గత గతంలో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ తరఫున అత్యధికసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా నరసాపురం నుంచి గెలుపొందారు. 1999లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగానూ కొత్తపల్లి పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ముదునూరి ప్రసాదరాజును ఓడించారు. ఇక 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నరసాపురం పోటీ చేసి ఓడిపోయారు.
మళ్లీ ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గానూ కొంత కాలం పనిచేశారు. గత ఎన్నికల ముందు టీడీపీ అసెంబ్లీ టికెట్ ను బండారు మాధవనాయుడుకు టీడీపీ ఇవ్వడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చారు.
అయితే వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్‌ను ముదునూరి ప్రసాదరాజుకు ఇచ్చింది. ఆయనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఏ పదవీ దక్కలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తపల్లి ఈసారి ఏ పార్టీలో చేరతారో వేచిచూడాల్సిందే.