Begin typing your search above and press return to search.
నన్ను గెలిపించండి ప్లీజ్.. అంటూ వేడుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే..!
By: Tupaki Desk | 12 Oct 2022 1:46 PM GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో అప్పుడే.. ముసలాలు పుడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్క డం కష్టమని భావిస్తున్న కొందరు నాయకులు తమ దారులు తాము వెతుక్కుంటున్నారు. ఈ విషయంలో వారు ఎలాంటి మొహమాటాలకు కూడా తావివ్వడం లేదు. ఇలాంటి వారి జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే.. మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీకి అత్యంత విధేయుడు.
పైగా.. సీఎం జగన్ అన్నా.. వైసీపీ అన్నా..ఆయనకు ఎనలేని మక్కువ. కానీ, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దర్శిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి..వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరఫున జెండా మోసే నాయకుడు.. కార్యకర్త కూడా లేకుండా పోయారు. అంతేకాదు.. ప్రభుత్వం తరఫున కూడా.. ఆయన ఎలాంటి పనులు చేయించుకోలేక పోతున్నారట.
ఈ విషయంలో ఇప్పటికే రెండు సార్లు అధిష్టానం దగ్గర పంచాయితీ కూడాజరిగిందని.. అయితే.. బూచేప ల్లి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆయనవైపే అధిష్టానం మొగ్గు చూపడంతో మద్దిశెట్టి.. ఇక, తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆయన మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉంటున్నారు. పైకి మాత్రం ఏమీ చెప్పడం లేదు.
కేవలం బూచేపల్లి వర్గంపైనే పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీ చెప్పినట్టుగా ఆయన..గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఇక్కడే కొన్ని రోజులుగా చిత్రమైన పరిణామం ఎదురవుతోంది. ప్రజల వద్దకు వెళ్లుతన్న మద్దిశెట్టి తనను గెలిపించాలని.. తనను ఆశీర్వదించాలని.. కోరుతున్నారట. అంతేకాదు.. తాను స్వయంగా చాలా సొమ్ము ఖర్చు చేసి.. నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నానని.. ప్రభుత్వం ఇచ్చినా..ఇవ్వక పోయినా.. తాను ప్రజలకు అండగా ఉన్నానని ఆయన చెబుతున్నారట.
అంతేకాదు.. తనను గుర్తు పెట్టుకోవాలని కూడా.. ప్రజలను కోరుతున్నారట. దీంతో ఇదేదో.. ఎమ్మెల్యే వ్యూహంగా ఉందని.. తనను గుర్తు పెట్టుకోవడం అంటే.. వైసీపీని మరిచిపోవాలని.. ఆయన కోరుతున్నారా? అనే చర్చ బూచేపల్లి వర్గంలో బయలు దేరింది. సో.. ఇది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.