Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి మాట మార్చాడు..

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:40 PM GMT
ఎర్రబెల్లి మాట మార్చాడు..
X
25 మంది ఎమ్మెల్యేలను మారిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ దే విజయం అంటూ ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నట్టు మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తన మాటలను వక్రీకరించారంటూ ఎర్రబెల్లి తాజాగా వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యేలను మార్చాలంటూ తాను చెప్పినట్లు వస్తున్న వార్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్రంలో 80 సీట్లు తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పానని స్పష్టం చేశారు.

మరో 20 సీట్ల కోసం గట్టిగా పనిచేయాలని చెప్పానని ఎర్రబెల్లి తెలిపారు. తాను కష్టపడాలని చెబితే మార్చాలని అన్నట్లుగా వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.

ఇటీవల ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వ్యతిరేకత ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను మార్చాలని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.. బీఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అని.. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని తెలిపారు. తన సర్వేలెప్పుడూ తప్పు కాలేదన్నారు. ప్రజల మద్దతు లేని 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను భర్తీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి 100 సీట్లు వస్తాయని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆ 25 మంది కూడా ఎవరో తనకు తెలుసు అని బాంబు పేల్చారు.. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు (కెసిఆర్)పై ప్రజలకు నమ్మకం ఉందని, అయితే పార్టీ విజయానికి ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితాలో మార్పులు అవసరమని ఆయన విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి దయాకర్ రావు కూడా తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు దుమారం రేపడం.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత రావడంతో పార్టీలో కలకలం రేగింది. దీంతో ఇప్పుడు నా మాటలను వక్రీకరించారని ఎర్రబెల్లి మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.