Begin typing your search above and press return to search.
వైసీపీ మంత్రి గారు భూములు రాసిచ్చేస్తున్నారు!
By: Tupaki Desk | 21 Dec 2022 2:30 PM GMTఆయన వైసీపీ మంత్రి. అయిదేళ్ల మంత్రిగా కూడా చెప్పుకోవాలి. రాయలసీమలో కర్నూల్ జిల్లా నుంచి మినిస్టర్ గా పనిచేస్తున్న గుమ్మలూరి జయరాం పనితీరు మీద విమర్శలు ఉన్నాయి. ఇక ఆయన మీద ఏదో విషయంలో వివాదాలనే మీడియా హైలెట్ చేస్తూ ఉంటుంది. ఆయన బీసీ మంత్రి. ఆయన మీద తాజా ఆరోపణ ఏంటి అంటే భూములు ఆక్రమించుకున్నారు అని.
అయితే దాన్ని మంత్రి గారు ఖండించారు. తాను ఎవరి భూములూ ఆక్రమించుకోలేదని జగన్ పుట్టిన రోజును వేదికగా చేసుకుని కాస్తా గట్టిగానే చెప్పారు మంత్రి. తాను భూ ఆక్రమణలు చేశానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. తాను పద్ధతిగానే భూములు కొన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
తాను ఇటినా కంపెనీ నుంచి వంద ఎకరాలు కొన్నది వాస్తవమే అని మంత్రి విషయం చెప్పేశారు. అయితే జగన్ పుట్టిన రోజు సందర్భంగా దాన్ని రైతులకు ఉచితంగా పంచేస్తాను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. వారి పేర్ల మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని మంత్రి చెప్పుకొచ్చారు.
మొత్తనికి మంత్రి భూములు ఇలా రాసివ్వడం సంచలనం అవుతోంది. అది కూడా వంద ఎకరాల భూమి రాసిస్తాను అంటున్నారు. రైతులకే దానిని ఇస్తానని అంటున్నారు. నిజంగా విశేషమే కదా. అయితే తాను ఆక్రమణలు చేయలేదని ఆయన చెబుతున్న దాని మీద విపక్షాలు ఇప్పటికైనా విడిచిపెడతాయా లేకుండా ఇంకా అదే కంటిన్యూ చేస్తాయా అన్నది చూడాల్సి ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే మంత్రి గారిలో ఇంతటి ఉదారత్వం ఎందుకు వచ్చిందన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. తన కోసం కొనుగోలు చేసుకున్న భూములను రైతులకు పంచిపెడతాను అనడం మాత్రం ఇటీవల కాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. ఒక విధంగా మంత్రి బిగ్ ట్విస్ట్ ఇచ్చారా అన్నది కూడా చూడాల్సి ఉంది.
తన మీద వస్తున్న ఆరోపణల మీద ఆయన రియాక్ట్ అవుతూ రావడం ఒక ఎత్తు అయితే పూర్తిగా చెక్ పెట్టేందుకే ఇలా భూ దానం చేస్తున్నారు అనీంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలో మరో మారు గెలిచేందుకు మంత్రి గారు ఈ తరహా దానాలకు దిగారని విపక్షాలు అన్నా ఆశ్చర్యం లేదు. అయితే అనేక వివాదాలను మంత్రిగా మూటకట్టుకున్న జయరాం కి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.
టికెట్ రాకపోతే ఆయన భూదానం చేసినా కూడా మైలేజ్ వచ్చినా ఎనందుకూ ఉపయోగపడని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రికి జగన్ పుట్టిన రోజు వేళ ఒక మంచి పని చేసేందుకు అవకాశం దొరికింది అని అన్న వారూ ఉన్నారు. తొందరగా ఆ పని చేసేసి జయరాం రైతులకు మేలు చేయాలని అంతా కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.