Begin typing your search above and press return to search.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి .. బాదుడే బాదుడు: రోజా ఫైర్
By: Tupaki Desk | 4 May 2022 3:00 AM GMTగతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
బాదుడే బాదుడు అంటూ తెలుగుదేశం అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి రోజా విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నిరకాల ఛార్జీలు పెంచేసి, ఇప్పుడు చంద్రబాబు నిరసనలకు సిద్ధం కావడం సరికాదన్నారు.
ఇలాగే చేస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి పరాజయం తప్పదన్నారు. గతంలో నరకాసుర ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టే ప్రజలు చంద్రబాబును దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారన్నారు.
''ఇక రేపటి నుంచి బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పడం చూసి అందరు నవ్వుకుంటున్నారు. కానీ ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి... దాని మనుగడ కోసం కొంచెం పెంచితే నానా యాగి చేస్తున్నారు. డిస్కంలు ఏ విధంగా నష్టాల్లో కూరుకుపోతే.. వాటి మనుగడ కోసం కొంచెం పెంచితే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు'' అని రోజా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. వ్యాట్ పెంచారని అన్నారు. కానీ ఏ రోజైనా జగన్ ఇచ్చే పథకాల్లో ఏమైనా ఇచ్చారా అంటే శూన్యమని ఎద్దేవా చేశారు.
అందుకే లోకల్ బాడి ఎన్నిక్లో బాదిన బాదుడికి అడ్రస్ లేకుండా పోయారని టీడీపీని రోజా విమర్శించారు. రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలుగు దేశం పార్టీని బాదుడే బాదుడని బాదేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు.