Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే బ్రహ్మనాయుడ్ని.. తెలుగు తమ్ముడు రూ.20 కోట్లు అడిగాడట
By: Tupaki Desk | 17 Sep 2022 4:15 AM GMTఅప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని సరికొత్తగా చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇంతకాలం కడుపులో ఉంచుకున్న ఆయన.. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగిస్తూ.. పాత విషయాన్ని కొత్తగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి గురించి చెప్పిన ఆయన.. జగన్ సర్కారు సాధించిన ఘనతల గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొత్త పోర్టుల్ని ఏర్పాటు చేస్తున్నామని.. జాతీయ స్థాయిలో పోటీ పడి బల్క్ డ్రగ్ పార్కును సాధించిన విషయాన్ని చెప్పుకొచ్చారు.
గతంలో ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పి.. అందరిని షాకులిచ్చారు. జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభిస్తున్నాయని.. చక్కటి ప్రోత్సాహం లభిస్తోందన్న ఆయన.. టీడీపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవటం తప్పించి.. అమలు పర్చిన పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ఒక అనుభవం గురించి అసెంబ్లీలో కథగా చెప్పుకొచ్చారు.
తాను చెబుతున్న ఉదంతం టీడీపీ ప్రభుత్వంలో జరిగిందన్న ఆయన.. ‘‘గతంలో ఒక టీడీపీ నేత సిగ్గు లేకుండా తనను లంచం అడిగాడు. నేను 2012లో గౌతమ్ బుద్ధ టెక్సాస్ పార్కు పేరుతో టెండర్ వేశా. ఆ టెండర్ మాకే వచ్చింది. డబ్బులు చెల్లించటంతో రిజిస్ట్రేషన్ కూడా జరిగింది.
కేంద్రం నుంచి రూ.40 కోట్లు సబ్సిడీ వచ్చింది. అది వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. రూ.40 కోట్ల సబ్సిడీలో రూ.20కోట్ల లంచం తనకు ఇవ్వాలని.. లేదంటే అనుమతి ఇచ్చేది లేదని చిలకలూరిపేటకు చెందిన టీడీపీ మంత్రి డిమాండ్ చేశారు’’ అని మండి పడ్డారు.
బ్రహ్మనాయుడి తీరు చూస్తే.. ‘చల్లకు వచ్చి ముంత దాచ నేల’ అన్న సామెత గుర్తుకు రాక మానదు. చిలకలూరిపేట కు చెందిన టీడీపీ మంత్రి అనే బదులు.. ఆ పేరేదో ఓపెన్ అయిపోతే సరిపోతుంది కదా? అనాల్సిన మాట అనేస్తున్నప్పుడు.. అదేదో మరింత క్లారిటీగా అనేస్తే.. లెక్క మరింత క్లియర్ గా ఉంటుంది కదా? ఇంతకీ రూ.20 కోట్లు ఇచ్చారా? లేదా? అన్న విషయం మీద కూడా వివరణ ఇచ్చి ఉంటే మరింత బాగుండేది కదా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.