Begin typing your search above and press return to search.
తెలంగాణ మహిళా ఎమ్మెల్యే.. డ్యాన్సులతో ఇరగదీశారుగా..!
By: Tupaki Desk | 16 Sep 2022 4:19 PM GMTతెలంగాణ మహిళా ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ పద్మ దేవేందర్ రెడ్డి డ్యాన్స్‌లతో ఇరగదీశారు. డప్పు చప్పుళ్లకు స్టెప్పులేసి.. అందరినీ ఆకర్షించారు. మెదక్ జిల్లాలో జరిగిన సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి రెచ్చిపోవడం.. డ్యాన్సులు ఇరగదీయడం.. ఆసక్తిగా మారింది. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర కళాశాలకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో బతుకమ్మ, బోనాలు, డప్పు చప్పుళ్లు, పీర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మ డ్యాన్స్ చేశారు. పిల్లలతో కలిసి స్టెప్పులేసి వారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని సమైక్యం చేయాలనే సంకల్పంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలను సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించార ని గుర్తు చేశారు. తద్వారా ఈరోజు బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వంటి పండుగలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్టు పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు.
ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతులకు ఉచిత కరెంటు, ఇంటింటికీ మంచినీళ్ల పథకం, రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నట్టు చెప్పారు. మెదక్‌కు రైలు వచ్చిందని.. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీ వస్తుందని అన్నారు. త్వరలో సొంత స్టలం ఉన్నవారికి డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ. మూడు లక్షలు ఇస్తామని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. అర్హత కలిగిన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చామని.. మరో 500 ఇళ్లూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని.. ఇప్పుడు జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.