Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎమ్మెల్యేకు దక్షిణ పడుతుందా....వైసీపీలో సీన్ ఏంటి...?

By:  Tupaki Desk   |   25 Oct 2022 3:30 PM GMT
జంపింగ్ ఎమ్మెల్యేకు దక్షిణ పడుతుందా....వైసీపీలో సీన్ ఏంటి...?
X
ఆయన టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉండేవారు. 2017 టైం లో జగన్ విశాఖ టూర్ పెట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ భూకబ్జాలు చేసిందన్న దాని మీద విశాఖ నడిబొడ్డున్న జగన్ ధర్నా నిర్వహించారు. ఆయన సాయంత్రం వెళ్ళిపోయిన తరువాత ఆ ప్రాంతం అంతా అపవిత్రం అయిందని పసుపు పాలుతో మొత్తం ప్రక్షాళన చేయించారు. ఆయన. ఆయన ఎవరో కాదు అప్పటి టీడీపీ విశాఖ సిటీ ప్రెసిడెంట్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ . ఆయనకు టీడీపీ మూడు సార్లు టికెట్ ఇచ్చింది. ఆయన విశాఖ సౌత్ నుంచి 2009లో ఫస్ట్ టైం పోటీ చేసి ఓడారు, కానీ 2014, 2019లో రెండు సార్లు గెలిచారు.

ఇక ఆయన 2019 తరువాత కొన్నాళ్ళకు వైసీపీలోకి జంప్ చేశారు. ఆయన వైసీపీలో సౌత్ నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ ని కన్ ఫర్మ్ చేయించుకున్నారు. ఇక ఆయన పార్టీతో సంబంధం లేకుండా ప్రతీ వారం ప్రజాదర్బార్ ని నిర్వహిస్తూ జనంలోనే ఉంటున్నారు. మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే వాసుపల్లి 2019 ఎన్నికల్లోనే తక్కువ మెజారిటీతో గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ద్రోణం రాజు శ్రీనివాస్ మీద 3 వేల 729 ఓట్ల తేడాతో గెలిచారు.

ఆయన మొదటిసారి గెలిచినపుడు 18 వేల ఓట్ల మెజారిటీ వస్తే ఈసారికి అది ఆరవ వంతుకు తగ్గింది. అప్పటికే ఆయన మీద వ్యతిరేకత ఉంది అని ఆ ఫలితం రుజువు చేసింది. ఇక 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీలో ఉన్నా టికెట్ దక్కదనే వైసీపీలో చేరారు అని చెబుతారు. 2024 ఎన్నికల్లో ఆయన నాలుగవ సారి వరసగా పోటీ చేస్తున్నారు అనుకోవాలి. మరి ఆయన వైసీపీలోకి మారినా వెంట టీడీపీ క్యాడర్ అయితే రాలేదని తెలుస్తోంది.

ఇక ఇటు వైపు చూస్తే వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే దివంగత ద్రోణం రాజు శ్రీనివాస్ వర్గానికి ఆయన కుమారుడు శ్రీవాత్సవ్ నాయకత్వం వహిస్తున్నారు. కోలా గురువులు అని 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మరో వర్గంగా ఉన్నారు.వీరు కాకుండా కార్పోరేటర్లు కొందరు వైసీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యేలు యాంటీగా మారారు. దీంతో సౌత్ లో వైసీపీకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాసుపల్లి అయితే వైసీపీలో మొదటి నుంచి ఉంటున్న నేతగా జగన్ నామస్మరణ చేస్తూ నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నారు.

కానీ టీడీపీలో కూడా గట్టి అభ్యర్ధినే ఇంచార్జిగా దింపారు. ఆయన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. దూకుడు రాజకీయానికి పెట్టింది పేరు. పైగా సౌత్ లో టీడీపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. దాంతో గండి బాబ్జీ వాసుపల్లి మీద బిగ్ ఫైట్ కి రెడీ అయిపోయారు. వాసుపల్లిని టీడీపీ టికెట్ మీద గెలిపిస్తే వైసీపీలోకి జంప్ చేయడం పట్ల జనంలో అసంతృప్తి ఉంది. అది ఆయన సొంత మైనస్ పాయింట్ అయితే అభివృద్ధి లేదు, అలాగే, వైసీపీలో వర్గ పోరు, బలంగా ఉన్న టీడీపీ, పైగా యాంటీ ఇంకెంబెన్సీ తోడు అయితే వాసుపల్లి హ్యాట్రిక్ కొట్టగలరా అన్నదే చర్చగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.