Begin typing your search above and press return to search.

ద్రోణం రాజు ఫ్యామిలీకి జగన్ హామీ... టీడీపీ ఎమ్మెల్యే సంగతేంటి...?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
ద్రోణం రాజు ఫ్యామిలీకి జగన్ హామీ... టీడీపీ ఎమ్మెల్యే సంగతేంటి...?
X
ఉత్తరాంధ్రా టైగర్ గా దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఎన్టీయార్ క్రేజ్ ఒక రేంజిలో వెలిగిపోతున్న వేళ ఆయన మీద హై కోర్టుకు వెళ్ళి వంద అవినీతి ఆరోపణలలో ఏడింటికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రుజువు చేసిన డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయన లోక్ సభ, రాజ్యసభలలో ఎంపీగా చాలా కాలం పనిచేశారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా దివంగత ద్రోణం రాజు శ్రీనివాసరావు రెండు టెర్ములు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కరోనా టైం లో చనిపోయారు.

ఇపుడు మూడవతరం వారసుడిగా ద్రోణం రాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ ఉన్నారు. ఆయన తండ్రి ఆశయాలను కొనసాగిస్తాను అని ముందుకు సాగుతున్నారు. అయితే ఆయనకు వైసీపీలో గట్టి భరోసా అయితే దక్కడంలేదు. వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలని ఈ యువ నేత భావిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వాసుపల్లి శ్రీనివాసరావు మరోసారి నేనే అంటున్నారు.

ఆయన నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకే టికెట్ అని ఆయన వర్గీయులు అంటున్నారు. మరి ద్రోణం రాజు శ్రీవాత్సవ్ కి అవకాశం ఉండదా ఉంటే ఏ పదవి ఇస్తారు అన్న చర్చ సాగుతోంది. మరో ఏణ్ణర్ధం పదవీకాలం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈలోగా పార్టీని నమ్ముకున్న వారందరికీ జగన్ నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు.

దాంతో కుటుంబసమేతంగా శ్రీవాత్సవ తాజాగా ముఖ్యమంత్రి జగన్ని క్యాంప్ ఆఫీసులో కలిసి అన్ని విషయాలు చర్చించారు. జగన్ నుంచి ఆయనకు తగిన హామీ లభించింది అని అంటున్నారు. ముందుగా నామినేటెడ్ పదవి ఒకటి ఆయనకు దక్కవచ్చు అని అంటున్నారు.

ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వేల మీద ఆధారపడిన హై కమాండ్ కి వాసుపల్లి విషయంలో కొంత అసంతృప్తిగానే నివేదికలు వచ్చాయని అంటున్నారు. పైగా ఆయన ఆ మధ్య తిరిగి టీడీపీలోకి వెళ్దామని ప్రయత్నం చేసి చంద్రబాబు అంగీకరించకపోతే వైసీపీలో కొనసాగుతున్నారని టీడీపీకి చెందిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ బాంబు పేల్చారు.

ఈ పరిణామాలతో వాసుపల్లి మీద కొన్ని డౌట్లు ఉన్నాయట. ఇప్పటికి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన వాసుపల్లి మీద సహజంగా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. అలాగే వైసీపీలో మొదటి నుంచి ఉన్న వారంతా ఫిరాయింపు నేతకు టికెట్ వద్దు అంటున్నారు.

దాంతో పాటుగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీవాత్సవకు టికెట్ ఇస్తే ఆ సామాజికవర్గం అక్కడ బలంగా ఉందని, తాత, తండ్రి గెలిచిన చోట మనవడు కూడా గెలిచే వీలుంటుందని, కొత్త ముఖానికి జనాల నుంచి మంచి స్పందన లభిస్తుంది అని అంటున్నారుట. మొత్తానికి చూస్తే ముందుగా నామినేటెడ్ పదవి ఇచ్చి జనంలో ఉండమని శ్రీవాత్సవకు చెబుతారని, 2024 ఎన్నికల్లో టికెట్ దక్కినా దక్కవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.