Begin typing your search above and press return to search.

మోడీ గొప్ప కాదు : విపక్షాల ఫెయిల్యూర్ ...?

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 AM GMT
మోడీ గొప్ప కాదు : విపక్షాల ఫెయిల్యూర్ ...?
X
ఎక్కడైనా పోటీ ఉంటేనే కధ రక్తి కడుతుంది. కానీ దేశంలో మాత్రం మోడీ వర్సెస్ విపక్షాలు తీసుకుంటే ప్రతీసారీ చివరకు వార్ వన్ సైడ్ అయిపోతోంది. దానికి కారణం సరైన వ్యూహంతో విపక్షాలు ముందుకు రాకపోవడం. ఆదికి ముందు బస్తీ మే సవాల్ అని తొడకొట్టిన వారు చివరి నిముషంలో ఇంకా చెప్పాలీ అంటే కరెక్ట్ టైమ్ లో తడపడిపోతారు. ఫలితంగా బీజేపీ ఖాతాలో ఒక సాధారణ విజయంగా నమోదు కావాల్సినది కాస్తా భారీ విజయంగా మారిపోతోంది. ఇది గత ఎనిమిదేళ్లుగా ఇలాగే సాగుతూ వస్తోంది.

ఇక లేటెస్ట్ ఉదాహరణ ఏంటి అంటే రాష్ట్రపతి ఎన్నికలు. రాష్ట్రపతి ఎన్నికలను చాలా ప్రతిష్టగా తీసుకున్నామని విపక్షాలు కడు నమ్మకంగా చెప్పుకొచ్చాయి. చాలా నెలలు ముందుగానే సందడి మొదలెట్టేశాయి. ఉత్తరాది ఎన్నికలలో బీజేపీ చాలా రాష్ట్రాలలో చావు దెబ్బ తింటుందని, ఫలితంగా ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో బీజేపీకి ఓట్లు తగ్గి విపక్షాల బలం పెరుగుతుందని అంచనా కట్టాయి.

కానీ యూపీ, గోవా, మణిపూఒర్, ఉత్తరాఖండ్ తిరిగి బీజేపీ నెగ్గి తొలి ఖంగు అక్కడ తినిపించింది. అయినా సరే రాష్ట్రపతి ఎన్నికల్లో టఫ్ ఫైట్ నడించేందుకు అవకాశాలు ఉన్నాయి. విపక్షాల శిబిరంలో ఓట్లు ఏమీ తక్కువ లేవు. అయితే అందరూ పెద్దలే, అందరూ లీడర్లే. ఒకరు పిలిస్తే మరొకరు రారు, ఇలా సాగిన కధ చివరికి చాలా పేలవంగా ముగియబోతోంది. మొదట అనుకున్న పేర్లు శరద్ పవార్ తప్పుకోగా, ఆ తరువాత గోపాలక్రిష్ణ గోఖలే. ఆ మీదట ఫరూఖ్ అబ్దుల్లా కూడా వద్దన్నాక ఇక మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాని తెచ్చారు.

అయితే ఆయన ఫేస్ వాల్యూ ఈ పోటీకి సరిపోలేదు. దానికి తోడు విపక్షాల ఆభిజాత్యం, వారి మధ్య ఉన్న ఇగోలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో టఫ్ ఫైట్ ని కాస్తా పలచన చేస్తూ పోయాయి. ఇంకో వైపు చూస్తే వరసబెట్టి విపక్ష శిబిరం నుంచి ఒక్కో పార్టీ మద్దతు బీజేపీ అభ్యర్ధి ద్రౌపది ముర్మునకు వెళ్తోంది. శివసేనను చీల్చి తిరుగుబాటు నాయకుడు షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేసినా ఉద్ధవ్ థాక్రే జై బీజేపీ అనాల్సి వచ్చింది. ఇంతకంటే విపక్ష శిబిరానికి అసలైన దెబ్బ ఏమి ఉంటుంది.

ఇక జేఎంఎం పార్టీ సైతం యూ టర్న్ తీసుకుంది. కర్నాటకలో దేవేగౌడ, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చేశారు. ఏపీలో చూసుకుంటే చివరి వరకూ చూసి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. నిజానికి చంద్రబాబు ఇప్పటివరకూ బాహాటంగా బీజేపీకి మద్దతు ప్రకటించలేదు.

కానీ విపక్షాలు రాష్ట్రపతి ఎన్నిక మీద జరిపిన సమావేశాలకు ఆయన్ని ఎపుడూ పిలవలేదు. దాంతో బాబు తన దారి తాను చూసుకున్నారు. ఇలా ఎన్నో రకాలుగా వ్యూహాత్మక తప్పిదాలు చేసి బీజేపీ అభ్యర్ధిని రాష్ట్రపతి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిపించడానికి విపక్షాలు శక్తికొలదీ సాయం చేశాయి అని అంటున్నారు. అంటే ఒక విధంగా ఇది మోడీ దక్షతకు గెలుపు అనే చెప్పాల్సి ఉంటుంది.

రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వారు కానీ రేపటి ఎన్నికల తరువాత 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్రపతి విచక్షణ అతి ముఖ్యమని భావించే వారు కానీ ఈ విధంగా టఫ్ ఫైట్ ని లైట్ ఫైట్ గా చేసుకోరు. కానీ భారత దేశ విపక్షాలు తీరు చూస్తే మాత్రం ఎప్పటికీ మేమింతే అనిపించేలా ఉంది మరి.