Begin typing your search above and press return to search.

ఎంపీటీసీలు... ఎంపీపీకి ఎలానో.. ఎమ్మెల్యేలు.. సీఎంకు అలానే.. అంతా డమ్మీలే!

By:  Tupaki Desk   |   4 May 2022 10:30 AM GMT
ఎంపీటీసీలు... ఎంపీపీకి ఎలానో.. ఎమ్మెల్యేలు.. సీఎంకు అలానే.. అంతా డమ్మీలే!
X
ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక విచిత్ర‌మైన ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. జాతీయ పార్టీల‌కు ఎలానో.. ప్రాంతీయ పార్టీల‌కు హైక‌మాండ్‌.. సుప్రీం.. సీఎం. ఆయ‌నే బాస్‌. తెలంగాణ‌లో కేసీఆర్ బాస్ అయితే.. ఏపీలో సీఎం జ‌గ‌న్ బాస్‌. ఇద్ద‌రూ కూడా .. ప్రాంతీయ పార్టీల‌కు య‌జ‌మానులు. మిగిలిన వాళ్లంతా.. డ‌మ్మీలేన‌ని.. చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ.. బీజేపీ రాష్ట్రాల్లో కానీ.. వార్డు మెంబర్ కూబా ప‌వ‌ర్ ఫుల్‌. ఎందుకంటే.. వాళ్ల‌కు అధికారం ఉంటుంది.

వాళ్లు అనుకుంటే.. ప్ర‌జ‌ల‌కు రోడ్లు కానీ, పింఛ‌న్లు కానీ.. సంక్షేమ ప‌థ‌కాలు కూడా ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర‌కు పోయి .. మ‌రీ... సాధించి తీసుకురావొచ్చు. ఎందుకంటే... ఎమ్మెల్యే ప‌ల‌క‌క‌పోతే.. ఎమ్మెల్యే పోయి నేరుగా.. హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేయ‌డం.. లేదా అస‌మ్మ‌తి రాగం వినిపిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. వైఎస్సార్ ఉన్న‌ప్పుడు.. వార్డు మెంబ‌ర్ కూడా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నారు. అప్పుడు వార్డు మెంబ‌ర్ ద‌గ్గ‌ర నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కొక్క ప్రొటోకాల్ ఉండేది.

అంతేకాదు.. రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక గౌర‌వం, మ‌ర్యాద వంటివి కూడా ఉండేవి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంచాయ‌తీ వార్డు మెంబ‌ర్ల నుంచి ఎంపీటీసీల నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, మినిస్ట‌ర్ వ‌ర‌కు ఎవ‌రూ కూడా వాళ్ల పింఛ‌న్ ఇప్పించ‌లేదు. పైగా పలుకుబ‌డి లేదు. ఎందుకంటే.. ప్ర‌తిదీ.. ముఖ్య‌మంత్రి నుంచి ఓట‌రుకు కేసీఆర్‌కే జిందాబాద్ కొట్టాలి.

ఏపీల అయితే.. సీఎం జ‌గ‌న్‌కే జిందాబాద్ కొట్టాలి. ఇలా ఉంది.. మ‌రి స్థానిక ప‌రిస్థితి. అయితే.. స్థానిక నాయ‌కులు.. ఆస్తులు అమ్మి.. రాజ‌కీయం చేసి.. వాళ్ల‌కు పెత్త‌నం అప్ప‌గించలేదా.. అని క్షేత్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. తెలంగాణలో అయితే.. టీఆర్ ఎస్‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ ఉంది.

ఇప్పుడు బీజేపీ బాగా పుంజుకుంటుంది త‌ర్వాత‌.. ప‌దేళ్ల‌లో అదే అల్ట‌ర్నేటివ్ అవుతుంద‌ని.. అంచ‌నాగా ఉంది. కానీ, ఏపీలో నేష‌న‌ల్ పార్టీల‌కు .. ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. కాబ‌ట్ఇ.. ప్ర‌జ‌లు న‌లిగిపోవాలి అంటున్నారు.

ముఖ్యంగా టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు.. కాబ‌ట్టి.. నాయ‌కులు అంతా డమ్మీ లేన‌ని అంటున్నారు. మ‌రి దీనిపై మీరుఏమంటారో.. కామెంట్స్ రూపంలో పెట్టండి.