Begin typing your search above and press return to search.

కౌంట్ డౌన్ స్టార్ట్స్‌.. మునుగోడు అష్ట‌దిగ్బంధం!

By:  Tupaki Desk   |   1 Nov 2022 2:30 AM GMT
కౌంట్ డౌన్ స్టార్ట్స్‌.. మునుగోడు అష్ట‌దిగ్బంధం!
X
మునుగోడు ఉప ఎన్నిక‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక, మ‌రో 24 గంట‌ల్లో ఈ ప్ర‌తిష్టాత్మ‌క ఉప పోరుకు ప్ర‌చారం ముగియ‌నుంది. దీంతో మునుగోడును అష్ట‌దిగ్బంధం చేసేందుకు పోలీసులు, ఎన్నిక‌ల సంఘం అధికారులు స‌ర్వ‌సిద్ధం అయిపోయారు. మంగళవారం సాయంత్రం 6 తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు ఉండ‌నున్నాయి.

అవ‌స‌ర‌మైతే.. ప్ర‌తి ఇంటినీ త‌నిఖీ చేయ‌నున్న‌ట్టు సీఈవో వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చినవారు నియోజకవర్గంలో ఉండకూడదని తెలిపారు. సోషల్ మీడియాపైనా వేటు వేస్తున్న‌ట్టు చెప్పారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌ల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదని స్ప‌ష్టం చేశారు.

మునుగోడులో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 50 మంది సర్వీసు ఓటర్లు, 5,686 మంది పోస్టల్ బ్యాలెట్‌ ఓటర్లు, 2576 మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఉప ఎన్నిక కోసం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మునుగోడులో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్త‌యింది. ఎన్నికల విధుల్లో 51 బృందాలు పని చేస్తున్నాయి.

105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల విధుల్లో 3,366 మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలు పాల్గొంటున్నాయి. అక్రమ నగదు రవాణా నేప‌థ్యంలో ఐటీ, జీఎస్టీ బృందాలు పని చేస్తున్నాయి. నిరంత‌ర‌ గస్తీలో 198 పోలీసు బృందాలు ఉన్నాయి.

నియోజకవర్గ సరిహద్దుల్లో వంద చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక‌, మంగ‌ళ‌వారం సాయంత్రం 6 తర్వాత మునుగోడులో విస్తృత తనిఖీలు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో బయటి నుంచి వచ్చినవారు నియోజకవర్గంలో ఉండేందుకు అనుమ‌తించ‌రు. పెద్ద మొత్తంలో ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం విధించారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపైనా నిషేధం విధించారు. చేతులపై బీజేపీ పార్టీ గుర్తులు వేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.