Begin typing your search above and press return to search.
మన ప్లాన్ ఇది కాదుకదా.. జీ-23 నేతల కామెంట్స్
By: Tupaki Desk | 27 Aug 2022 2:30 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతలైన జీ-23 నాయకులు సందీప్ దీక్షిత్, ఆనంద్ శర్మ స్పందించారు. ఆయన ఇలా చేస్తారని అసలు ఊహించలేదని అన్నారు.
జీ23ని బలోపేతం చేసింది ఇందుకోసం కాదని, ఇలా చేయడం వల్ల పార్టీ ఇంకా బలహీన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అసహనం వ్యక్తం చేశారు.
రాజీనామా విషయం తెలిసిన మరుక్షణమే సందీప్ ఆజాద్ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. "మీ రాజీనామా లేఖ చదివినప్పుడు నాకు మీరు వెన్నుపోటు పొడిచిన భావం కలుగుతోంది" అని అందులో పేర్కొన్నారు.
కాంగ్రెస్లో కీలక బాధ్యతలను చేపట్టిన ఆజాద్ అంటే తనకు ఎంతో అభిమానం ఉండేదని చెప్పారు దీక్షిత్. ఆయన జీ23 ప్రతిపాదన సమయంలో అధిష్ఠానానికి రాయాల్సిన లేఖను తెచ్చినప్పుడు కూడా మనస్ఫూర్తిగా సంతకం చేశానని వెల్లడించారు.
"అధిష్ఠానానికి మనం రాసిన లేఖను మీరు విస్మరించారా? మనలో కొందరు ఆ లేఖను ఒక మంచి మార్పుకోసం ప్రతిపాదించా రు. మరికొందరు ఆ లేఖలోని మాటలకు మద్దతిచ్చారు. మనం అప్పట్లో సంస్కరణలకు తెరలేపాలనుకున్నామే కానీ ఇలా తిరుగుబాటు కోసం కాదు" అని సందీప్ లేఖలో పేర్కొన్నారు.
ఇదే విషయంపై మరో కాంగ్రెస్ సీనియర్ ఆనంద్ శర్మ స్పందించారు. ఈ కీలక పరిణామం కాంగ్రెస్ నేతలందరినీ బాధిస్తోందని ఆయన అన్నారు. ఆజాద్ ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదని చెప్పారు. అధిష్ఠానం ఒకసారైనా ఆత్మవిమర్శ చేసుకుంటుం దని తాము భావించినా, దురదృష్టవశాత్తు అది జరగలేదని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. పార్టీని వదిలి పెట్టడం సరికాదని.. నాయకులు వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటూ.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయించడం సరైన విధానంగా పేర్కొన్నారు.