Begin typing your search above and press return to search.

పాతికేళ్లలో పాకిస్తాన్ అంతలా మారిందట.. కొత్త విషయాలు వెలుగులోకి

By:  Tupaki Desk   |   18 March 2022 9:49 AM GMT
పాతికేళ్లలో పాకిస్తాన్ అంతలా మారిందట.. కొత్త విషయాలు వెలుగులోకి
X
మార్పు కాలానికి ఉన్న గొప్ప గుణం. ఎలాంటి వారైనా సరే.. వారిని మార్చే సత్తా మాత్రం కాలానికే సొంతం. దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత (కచ్ఛితంగా చెప్పాలంటే 24 ఏళ్లు) పాకిస్థాన్ తో క్రికెట్ టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంది. 1998లో చివరిసారిగా ఆసీస్ జట్టు పాక్ లో పర్యటించింది. ఆ తర్వాత మళ్లీ ఆ జట్టు పాక్ కు వచ్చింది లేదు. ఇదిలా ఉంటే.. 24 ఏళ్ల క్రితం జట్టుతో పాటు ఆసీస్ పాక్ కు వచ్చిన ఆ దేశ క్రికెట్ వీరాభిమానికి చేదు అనుభవం ఎదురైంది.

తమ దేశ జట్టును ప్రోత్సహిస్తున్న లూక్ గిల్లియన్ పై పాక్ అభిమానులు రాళ్లతో దాడి చేయటంతో పాటు.. అతడ్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ లో పర్యటిస్తున్న వేళ.. ఆ జట్టుతో పాటు పాక్ కు వచ్చిన అతడు.. 24 ఏళ్ల కాలంలో పాకిస్థాన్ మాత్రమే కాదు పాక్ క్రికెట్ అభిమానుల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయిందని చెబుతున్నాడు.

తమకు నచ్చని ఆటగాళ్ల విషయంలో పాక్ అభిమానులు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే.. 24 ఏళ్ల క్రితం పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా వీరాభిమాని లూక్ పై రాళ్లు విసరటంతో పాటు.. తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ మండిపడేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా.. గతంలో జరిగిన తప్పులకు సారీ చెప్పటం విశేషం.

అంతేకాదు.. గతంలో తమ దురుసు ప్రవర్తనకు సారీ చెప్పి.. సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపిస్తున్నారట. గడిచిన కొద్ది రోజులుగా అతడు వందలాది మందికి సెల్ఫీల కోసం అడగటమే కాదు.. క్రికెట్ అభిమానులు అతనికి టీ తాగించటంతో పాటు.. కేక్ లు.. పెప్సీ బాటిళ్లు.. ఫ్రీ హెయిర్ కట్ తో పాటు ఫ్రీ లాండ్రీ లాంటి వాటి సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున అభిమానాన్ని చాటుతున్నారట. వారి అభిమానంతో తడిచి ముద్ద అవుతున్న ఈ ఆసీస్ క్రికెట్ వీరాభిమాని ఇప్పుడు ఫిదా అవుతున్నారు.