Begin typing your search above and press return to search.
పవన్ చేతిలో రోడ్ మ్యాప్ ... అందులో ఏముంది....?
By: Tupaki Desk | 16 Nov 2022 2:30 AM GMTఏపీ మీద బీజేపీ పక్కా ప్లానింగ్ తోనే ఉంది. ఏదో విధంగా ఏపీలో అధికారంలో తన వాటాను నిరూపించుకోవాలని చూస్తోంది. పక్క వాయిద్యంలా ఉండడానికి అసలు ఇష్టపడడంలేదు. మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ణి తమ వైపు ఉంచుకుని ఏపీలో రాజకీయాన్ని అనువుగా చేసుకోవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీని ఎలాగైనా గద్దె దించడానికి బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలంగా కోరుతున్నారు. ఆయన ఇప్పటికి ఏడెనిమిది నెలల నుంచి ఇదే రకమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే తాజాగా విశాఖపట్నంలో మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంగా రోడ్ మ్యాప్ ఆయనకు ఇచ్చారా ఇస్తే అందులో ఏముంది అన్న దాని మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి.
వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీలో ఏమి మాట్లాడుకున్నారు అన్నది ఈ ఇద్దరికే తప్ప మూడవ వారికి తెలియడంలేదు. దాంతో పాటు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం కూడా కొత్త రకాలైన ఊహాగానాలకు తావిస్తోంది. ప్రధనమంత్రి అయినా పవన్ అయినా తమ మధ్య ఏమి జరిగింది అన్నది చెప్పాలి. ఇక్కడ ఇద్దరూ చెప్పకపోవడం వల్ల రాజకీయ జనాలు అయితే ఎవరి శైలిలో వారు ఊహాగానాలు మాట్లాడుకుంటున్నారు.
అందులో కీలకమైనది ఏంటి అంటే పవన్ చేతికి రోడ్ మ్యాప్ మోడీ ఇచ్చారని అంటున్నారు. ఆ రోడ్ మ్యాప్ లో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు రెండే ఉంటాయట. ఆ రెండూ బీజేపీ, జనసేన అని అంటున్నారు. మూడవ పార్టీగా తెలుగుదేశానికి ఎలాంటి చాన్సూ అవకాశం లేదని అంటున్నారు.
ఇక ఏపీలో జనసేనను వైసీపీ మీద పోరాటం చేయమని, తన బలాన్ని విస్తరించుకోమని చెబుతూ మోడీ దిశా నిర్దేశం చేశారని అంటున్నారు. ఎన్నికల వేళ రెండు పార్టీలు ఒక్కటిగా జనంలోకి వచ్చి బలమైన కూటమిగా అవతరించేలా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ ఇద్దరి భేటీ మీద తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయిస్తోంది. ఏమి జరిగి ఉంటుంది అన్నది తమ ఊహలకే పరిమితం చేసుకుంటోంది. అధికారంలో ఉన్న వైసీపీ సైతం ఈ భేటీలో ఏదో ఒకటి జరిగి ఉంటుందని ఊహిస్తోంది. అయితే అది తమకు ప్లస్ గా మారుతుందా మైనస్ అవుతుందా అన్న దాని మీద మాత్రం ఒక అంచనాకు రాలేకపోతోంది.
ఇంకో వైపు చూస్తే ఏపీలో వర్తమాన పరిస్థితుల మీదనే మోడీ పవన్ కళ్యాణ్ ఇద్దరూ మాట్లాడుకున్నారని అంటున్నారు. అలాగే ఏపీలో బీజేపీ నేతల సహాయ నిరాకరణ మీద కూడా పవన్ మోడీ దృష్టికి తెచ్చి ఉంటారని అంటున్నారు. అయితే బీజేపీ జనసేన రెండూ సమిష్టిగా పనిచేసేలా చూస్తామని మోడీ హామీ ఇచ్చారని కూడా మరో ఊహాగానం ఉంది.
ఇలా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా ఎక్కడా కూడా తెలుగుదేశంతో కలుస్తామని మోడీ చెప్పినట్లుగా ఊహాగానాలు రావడం లేదు అంటున్నారు. ఇక మోడీని ట్విట్టర్ వేదికగా పవన్ పొగిడేయడం బట్టి చూస్తే పవన్ కి మంచి హామీ అయితే ప్రధాని మోడీ నుంచి లభించింది అని అంటున్నారు. అదే టైం లో ప్రధాని కేవలం జనసేన మీదనే నమ్మకం ఉంచి ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తారని, అదే రోడ్డు మ్యాప్ అని కూడా అంటున్నారు.
మొత్తానికి రోడ్ మ్యాప్ ఇచ్చారా అంటే ఇచ్చారు అని అంటున్నారు. అందులో ఏముంది అంటే ఎవరికి తోచిన ఊహాగానాలే వినిపిస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మాత్రం ఏపీలో జనసేన బీజేపీల మధ్య ఎలాంటి కార్యచరణకు డిస్కషన్ జరిగింది. తెలుగుదేశానికి అందులో చోటు ఉందా అన్న దానికి మాత్రం బదులు అయితే లేదు అని అంటున్నారు. కాలక్రమేణా ఆ విషయాలు తేలాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.