Begin typing your search above and press return to search.

మోడీ.. జిన్ పింగ్ ఎదురు పడిన వేళ.. అలా జరిగిందట

By:  Tupaki Desk   |   17 Sept 2022 9:39 AM IST
మోడీ.. జిన్ పింగ్ ఎదురు పడిన వేళ.. అలా జరిగిందట
X
ప్రపంచంలోనే రెండు దేశాలు.. అవి కూడా ఇరుగుపొరుగు.. అంతేనా.. అత్యధిక జనాభా ఉన్న దేశాలుగా గుర్తింపు పొందిన ఈ రెండు దేశాలు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. అవును.. అందులో ఒకటి భారతదేశమైతే.. రెండోది చైనా.

ఈ రెండు దేశాలకు చెందిన అధినేతలు ఎదురెదురు పడిన వేళలో.. ఇరువురి మధ్య ఏమీ చోటు చేసుకోకపోవటం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. ఉజ్బెకిస్థాన్ లోని సమర్ ఖండర్ లో. ఈ సదస్సుకు భారత్.. చైనాలతో పాటు పలు దేశాల ప్రముఖులు హాజరయ్యాయి.

ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ఎదురెదురు పడిన సందర్భంలోనూ ఎడముఖం .. పెడముఖం అన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. కనీసం పలుకరించే ప్రయత్నం చేసుకోలేదు. అంతేకాదు.. డిన్నర్ మీటింగ్ కు ఎప్పటిలానే పెద్దగా ప్రయారిటీగా ఇవ్వని మోడీ.. దానికి డుమ్మా కొట్టేశారు. అయితే.. ఈ డిన్నర్ లోనూ పలువురు ప్రముఖులు భేటీ అయినా.. మోడీ మాత్రం లైట్ తీసుకోవటం గమనార్హం.

2020 గల్వాన్ ఉదంతం తర్వాత ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు ఒకే వేదిక ను పంచుకున్నది ఇదే తొలిసారి. దీంతో.. ఈ ఇరువురి మధ్య మాటా మంతి ఉంటుందేమోనని చూసినోళ్లకు.. వారిద్దరూ ఎవరికి వారుగా ఉండటం గమనార్హం.

వివిధ దేశాధినేతలతో కలిసి ఫోటో దిగిన వేళ.. ఫోటోకు ఎడమ నుంచి మొదటగా మోడీ ఉంటే.. మధ్యలో జిన్ పింగ్ ఉన్నారు. అంత దగ్గరగా ఉన్నప్పటికీ.. వారిద్దరూ ఎవరికి వారుగా ఉండటమే కానీ.. పలుకరించుకునే ప్రయత్నం చేయలేదని.. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.