Begin typing your search above and press return to search.
పోలవరం పరిహారం దోచుకుంటున్న పాపులు...?
By: Tupaki Desk | 20 Aug 2022 2:30 AM GMTఆంధ్రాకు అన్నం పెట్టే పోలవరం ప్రాజెక్ట్ కోసం తామున్న చోటుని, నీడను, తమ భూములను కూడా వదిలేసి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇచ్చేస్తున్న వారు త్యాగధనులే అనాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే వారికి ఎంత లాభమో తెలియదు కానీ నష్టం కష్టం మాత్రం వారిదే. ఇక ఏపీ అంతా బాగుపడుతుంది, ఆంధా వెలుగు జిలుగులతో తరిస్తుంది అని వారు గొప్పగా భావించబట్టే భూ సేకరణలో అంతా వదిలేసుకుంటున్నారు.
అలాంటి వారికి పునరావాస ప్యాకేజీ అమలు చేయాలి. అలాగే వారికి న్యాయంగా దక్కాల్సిన నష్టపరిహారం దక్కాలి. కానీ మధ్యలో దళారులు చేరి మింగేస్తున్నారు. వారికి అధికారుల స్థాయిలో కూడా పెద్దలు సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మరి దీన్ని చూస్తే పోలవరం పునరావాస ప్యాకేజిని కూడా దోచుకుంటున్న పాపులు వీరంతా అనాల్సి వస్తోంది.
పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ఇరవై వేల కోట్లు ఖర్చు అయితే పునరావస ప్యాజేజి కోసమే మరో 36 వేల కోట్లు ఖర్చు చేయాల్సివస్తోంది. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ కంటే పునరావాస ప్యాకేజికి అయ్యే ఖర్చు డబుల్ అన్న మాట. మరి అనేక గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి వారికి కాలనీలు నిర్మించి వేరే చోటకు తరలించడం అంటే మాటలు కాడు, మూటలే. మరి ఆ మూటలు విప్పి నిరాశ్రయులు అయిన వారికి ఇవ్వాల్సిన వారు సవ్యంగా పంచుతున్నారా అంటే లేదు అన్న జవాబే వస్తుంది.
దానికి ఎన్నో ఉదాహరణలు కంటికి కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో రకాలైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ దిగువన ఉన్న నిర్వాసితులకు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి భూమి ఉన్న వారి విషయంలో సర్వే చేస్తారు. వారి పేరున భూమి ఉందన్న పట్టాదారు పాస్ బుక్కులు చూస్తారు. ఆ మీదట వారికి ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజీ కింద చట్టప్రకారం అంటే 2013లో సవరించిన దాని మేరకు భారీ ఎత్తున పరిహారం చెల్లించాలి. కానీ అలా జరగడంలేదు అని నిర్వాసితులు లబోదిబోమని అంటున్నారు.
విషయానికి వస్తే ఏలూరు జిల్లా కుక్కనూరు మండలం ఉప్పేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడెంకి చెందిన మడెం పోడయ్య అనే గిరిజన రైతుకు 172, 66, 25 సర్వే నెంబర్లలో అయిదెకరాల భూమి ఉంది. దీన్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. ఆ మీదట ఆయనకు ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకారం చెల్లించాల్సిన మొత్తానికి భూమి పట్టా, పాస్ పుస్తకాల జెరాక్సులు తీసుకురమ్మంది. అయితే అయితే ఆయనకు మాత్రం తిరిగి వేసారినా చివరికి నష్ట పరిహారం ముట్టలేదు. మధ్యలోని దళారులే వాటిని మింగేశారుట.
దీని మీఅ సదరు రైతు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం కధ బయటపడింది. నకిలీ రశీదులు సృష్టించిన రెవిన్యూ సిబ్బంది పాత్ర కూడా ఇందులో ఉంది అని తేలింది అంటున్నారు. ఇక్కడ మోసపోయినది ఒక్క మడెం పోడయ్య మాత్రమే కాదు వందలాది మంది అమాయక గిరిజన రైతులను ఇలా మోసం చేస్తున్నారు. ఇందులో అధికారుల సహకారంతో మధ్య దళారులే ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజీ సొమ్ము అంతా దిగమింగుతున్నారు అని అంటున్నారు.
ఇక అవినీతి ఆరోపణలు ఉన్న అధికారుల జాబితా చూస్తే వీఆర్ఏలు, వీఆర్వోలు లాంటి క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా స్పెషల్ కలెక్టర్ వరకు పలువురి మీద ఆరోపణలు ఉండడంతో ఆర్ ఆర్ ఆర్ ప్యాకేజిలో అన్యాయం ఎలా జరుగుతోంది అని అంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి భాగోతాలలో అవినీతి ఆరోపణలతో తాశీల్దార్ స్థాయి అధికారులే జైలు పాలు అవుతున్నారు.
అయితే వీరంతా పాత్రధారులే అని సూత్రధారులుగా బిగ్ షాట్స్ ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఏ స్థాయిలో అవినీతి చేసిన వారు ఉన్నా వదలమని అంటోంది కానీ జరగాల్సింది జరిగిపోతోంది అంటున్నారు. ఇక పోలవరం నిర్వాసితులకు ఒక దఫా నష్టపరిహారం చెల్లించారు. అది వైఎస్సార్ సీఎం గా ఉండగా 2009లో ఇవ్వడం జరిగింది. నాడు ఎకరానికి లక్షన్నర చెల్లించి వారికి పునరావాసం కూడా ఇచ్చారు.
ఇక్కడ చిత్రమేంటి అంటే ఆనాటి చెల్లింపులలో కూడా అవినీతి మీద ఈ రోజుకీ విచారణలు జరగడం. అంటే ఇది అలా కొనసాగుతోంది అన్న మాట. ఇక 2013లో భూసేకరణ చట్టంలో మార్పులు వచ్చాయి. దాంతో నష్టపరిహారం విషయంలో కూడా చాలా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోంది. సరిగ్గా ఇక్కడే అవినీతిపరులు రెక్కలు విప్పుకుంటున్నారు. పెద్ద మొత్తాలలో చెల్లింపులు కావడంతో అవినీతి భాగోతాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి అని అంటున్నారు.
ఇక గతానికి భిన్నగా మూడు రెట్లు నష్టపరిహాం చెల్లించాల్సి ఉండగా అదనంగా మరింత ఇస్తామని నాటి సీఎం చంద్రబాబు అంటే విపక్ష నేతగా జగన్ అదనంగా అయిదు లక్షలు చెల్లిస్తామని చెప్పారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉందని అంటున్నారు. ఇక్కడ నిర్వాసితులకు అందడం లేదు, సకాలంలో చెల్లించాల్సింది ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి భారం గా ఉంటోంది. మధ్య దళారులు కొందరు అధికారులు మాత్రం అవినీతి కధ నడుపుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.
ఇక పోలవరం కోసం భూసేకరణ 67 శాతం మాత్రమే పూర్తి అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెల్లింపులు కేవలం ఏడు శాతమే జరిగాయంటే ఆలోచించాల్సిందే. మొత్తం 320 ఆవాసాలు ముంపు బారిన పడుతుండగా, పూర్తిగా పరిహారం చెల్లించేందుకు కనీసం మరో రూ. 29 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే అరకొర చెల్లింపులే జరిగాయని గిరిజన సంఘం అంటోంది. తమకు పూర్తి న్యాయం జరగాలని కోరుతోంది. మరో వైపు డిప్యూటీ సీఎం రాజన్నదొర అయితే ఎలాటి అవకతవకలకు చోటు లేకుండా అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసి తీరుతామని చెప్పారు. అవినీతి ఎవరు చేసినా చర్యలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి.