Begin typing your search above and press return to search.
రేపల్లె గ్యాంగ్ రేప్ కు ఇదేం భాష్యం వనితమ్మ?
By: Tupaki Desk | 4 May 2022 3:30 AM GMTసభ్య సమాజం తలదించుకునేలా.. అందరూ తిరిగే బహిరంగ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం.. బాధితురాలి భర్తపై దాడి చేసి.. అతడి ఎదుటే ఆమెను లాక్కెళ్లిపోవటం.. దీంతో అతను పరుగు పరుగున రైల్వే పోలీసుల వద్దకు వెళితే.. మేమేం చేయగలమని చేతులెత్తేయటం లాంటి దారుణాలు ఈ ఉదంతంలో కనిపిస్తాయి. అక్కడితో ఆగని ఆరాచకం మరింత కొనసాగింది.
తన కళ్ల ముందు తన భార్య గ్యాంగ్ రేప్ కావటాన్ని తట్టుకోలేక.. రైల్వే స్టేషన్ బయటకు వెళ్లి సాయం కోరితే.. ఒక్క మగాడు కూడా ముందుకు రాకపోవటం.. దగ్గర్లో పోలీస్ స్టేషన్ ఉందని చెప్పి చేతులు దులుపుకోవటం చూస్తే.. రేపల్లె ప్రజానీకం తీరు షాక్ కు గురి కాక మానదు. చివరకు.. రైల్వే స్టేషన్ కు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెబితే.. వారు రంగంలోకి దిగిన తర్వాత కానీబాధితురాలిపై సాగిన రాక్షస కాండ ఆగలేదు. అప్పటికే బాధితురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిపోయింది.
ఇంత దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని గంటల వ్యవధిలోనే నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ అత్యాచారం రేపిన ప్రకంపనలు ఒక కొలిక్కి రాని వేళ.. ఈ ఉదంతంపై ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఒళ్లు బలిసి.. కామంతో కొట్టుకుంటున్న నిందితులు ఒక ఆడబిడ్డపై పిశాచాల మాదిరి పడిన ఉదంతాన్ని.. మద్యం మత్తులో జరిగిన ఉదంతంగా హోం మంత్రి చెప్పటం దేనికి సంకేతం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అంతేకాదు.. బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి యత్నించిన నిందితులు.. మద్యం మత్తులో ఆఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా చెప్పటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగతనానికి వచ్చిన వారు డబ్బుల మీద ఫోకస్ చేస్తారు. అది కూడా అందరూ ఉన్న చోట ఏ దొంగ అయినా దౌర్జన్యం చేసి డబ్బులు దోచుకునే అవకాశం ఉండదు కదా? కానీ.. హోం మంత్రి మాత్రం అలా చెప్పటం ఏమిటి? అన్నది ప్రశ్న.
జరిగిన ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తే.. కామంతో కన్ను మిన్ను కాన రాకుండా కావాలనే.. భర్తపై దాడి చేసి.. భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పాలి. ఒక రైల్వే స్టేషన్ ఆవరణలో ఇలాంటి దారుణానికి పాల్పడే బరితెగింపు చూస్తేనే.. ఈ నిందితులెంత కరుడుగట్టిన వారన్నది అర్థమవుతుంది.
ఇలాంటి విపరీత ఉదంతాన్ని సింపుల్ గా మద్యం మత్తులో జరిగిన అత్యాచారంగా తేల్చేయటం ఏమిటి? మద్యం మత్తులో ఉన్న వారంతా గ్యాంగ్ రేప్ లు చేస్తారన్నదే నిజమైతే.. ఈ దేశంలో కొన్ని లక్షల రేప్ లు రోజువారీగా జరగాల్సి ఉంటుంది. ఒక వికారపు ఉదంతాన్ని మద్యం మత్తు పేరుతో పరిమితం చేయటం ఏ మాత్రం సబబు కాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.