Begin typing your search above and press return to search.

జగన్ సీరియస్ అయ్యారంటే... సజ్జల భలే సర్దేసారే !

By:  Tupaki Desk   |   16 Dec 2022 1:30 PM GMT
జగన్ సీరియస్ అయ్యారంటే... సజ్జల భలే సర్దేసారే !
X
ఎక్కడైకా ఎవరైనా కోపంగా మాట్లాడితే హర్ట్ అవుతారు. అది సహజం. సీరియస్ గా మాట్లాడితే చిన్నబుచ్చుకుంటారు. అయితే ఒక రాజకీయ పార్టీలో ఇలాంటివి జరిగినపుడు అది బయటకు బాగానే వస్తుంది. అటూ ఇటూ పట్టుకుని దాన్ని లాగుతారు. అర్ధాలు పరమార్ధాలు తీస్తారు.

ఏపీలో జగన్ వర్క్ షాప్ అంటే చాలు మీడియాకు మసాలా దొరికినట్లే. ఎంతమందికి జగన్ తలంటారు, ఎంతమందిని ఆయన ఏసుకున్నారు. ఎంతమంది మీద సీరియస్ అయ్యారు ఇవన్నీ క్షణాల్లో మ్యాటర్ లీక్ అయి బయటకు వస్తాయి. దాంతో లోపల ఏమి జరిగినా బయట వ్యవహారం సీరియస్ గానే ఉంటుంది. చివరికి అది కాస్తా నెగిటివ్ గా మారుతుంది కూడా.

దాంతోనే గడప గడప వర్క్ షాప్ అంటే ఎమ్మెల్యేలకు గుండె దడ పట్టుకుంతోంది. ఇదిలా ఉంటే మైనస్ మార్కులు సర్వేలు, నివేదికలు ప్రోగ్రస్ రిపోర్టులు ఇలా చాలా ఉంటాయి. కాబట్టి మ్యాటర్ చిరిగి చాటంత అవుతుంది. దీని మీద మీడియా ఫుల్ అటెన్షన్ పెట్టి ఉంచుతుంది. ఇదిలా ఉంటే జగన్ వర్క్ షాప్ లో కొందరు పనిచేయని ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారని వచ్చిన వార్తల పట్ల ప్రభుత్వ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ సీరియస్ అయ్యారన్నది పార్టీకి నెగిటివ్ కాదు అని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అందరికీ తెలుసు. మా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఆయన ఆలోచన కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తారు కాబట్టి అందులో వేరే ఉద్దేశ్యాలు ఉండవంటూ పేర్కొన్నారు. మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలు మరోసారి గెలవాలి అన్నదే జగన్ ఆలోచన అని సజ్జల వివరించారు. అందుకే సర్వేలు ఎప్పటికపుడు నిర్వహించి వాటి ద్వారా వచ్చిన ఫలితాలను ఎమ్మెల్యేలకు వివరిస్తూ అలెర్ట్ చేస్తున్నారని ఇది నిరంతరం జరిగే కార్యక్రమం అని ఆయన అన్నారు. ఈ విషయంలో సీఎం సీరియస్ అయ్యారు అని వ్యతిరేకంగా ప్రచారం ఎవరు చేయాలనుకున్న తప్పే అన్నట్లుగా సజ్జల మాట్లాడారు.

ఏపీలో 175 కి 175 సీట్లు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, దానికి తగినట్లుగానే తమ యాక్షన్ ప్లాన్ ఉంటోందని ఆయన వివరించారు. సీఎం తానుగా ఏ ఒక్క ఎమ్మెల్యే టికెట్ ని నిరాకరించే ప్రసక్తి ఉండదని, అంతదాకా పరిస్థితి తెచ్చుకోవద్దు అని హెచ్చరించడానికే ఈ వర్క్ షాప్ అని ఆయన పేర్కొన్నారు. ఇలా ప్రతీ మూడు నెలలకూ వర్క్ షాప్ నిర్వహించి అప్పటిదాకా చేసిన సర్వేల నివేదికలను ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ముందు ఉంచుతారని ఆయన తెలిపారు

జనంలో ఉంటే గడప గడపకు తిరిగితే ఎమ్మెల్యేలకే లాభమని, పార్టీ గ్రాఫ్ బాగా పెరుగుతుందని సజ్జల చెబుతున్నారు. పని శ్రద్ధగా చేయాలని ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి చెప్పారని, అలాగే ప్రజలకు బాగా చేరువ కావాలని ఆయన కోరారని అంటున్నారు. ప్రజల దగ్గరకు వెళ్ళడం, వారికి సన్నిహితం కావడమే తమ అజెండా అందే తమ వ్యూహమని ఆయన అన్నారు. సో జగన్ సీరియస్ అన్నది నెగిటివ్ కానే కాదని సజ్జల భలే సర్దేశారని అంటున్నారు. మరి అంతా లైట్ గా తీసుకుంటే వర్క్ షాప్ ఎందుకు, అందులో సీరియస్ గా చెప్పడం ఎందుకు అన్న చర్చ కూడా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.