Begin typing your search above and press return to search.

చుక్కలు చూపించబోతున్న సూసైడ్ బాంబర్లు

By:  Tupaki Desk   |   28 April 2022 7:30 AM GMT
చుక్కలు చూపించబోతున్న సూసైడ్ బాంబర్లు
X
పాకిస్ధాన్లోని డ్రాగన్ దేశానికి సూసైడ్ బాంబర్లు చుక్కలు చూపించబోతున్నారు. పాకిస్ధాన్ లోని బలూచిస్ధాన్ ప్రాంతంలో చైనా అనేక ప్రాజెక్టులు చేస్తోంది. బలూచిస్ధాన్ ప్రాంతంలోని సహజవనరులను చైనా కొల్లుగొట్టుకుపోతోందంటు స్ధానికులు మండిపోతున్నారు. పాకిస్ధాన్ ప్రభుత్వం పూర్తిస్ధాయి మద్దతుతోనే చైనా తన కార్యకలాపాలు చేస్తోందంటు బలూచిస్ధాన్ జనాలు ఎప్పటినుండో మండుతున్నారు. చైనాను తమ ప్రాంతం వదిలి వెళ్ళిపోవాలని పోరాటాలు చేస్తున్నారు.

అయితే వీళ్ళ పోరాటాలను ఇటు పాకిస్ధాన్ కానీ అటు చైనా కానీ ఏమాత్రం లెక్కచేయటంలేదు. దాంతో సాయుధ పోరాటానికి బదులు తమ రూటు మార్చాలని బలూచిస్ధాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగానే సూసైడ్ బాంబర్ ను ప్రయోగించింది. సూసైడ్ బాంబర్ పద్దతిలో బీఎల్ఏ దళాలు దాడిచేస్తాయని పాకిస్ధాన్, చైనాలు ఏమాత్రం ఊహించలేదు. తాజా దాడిలో ముగ్గురు చైనా వాళ్ళతో పాటు ఒక పాకిస్ధాన్ జాతీయుడు కూడా చనిపోయాడు.

ఇక్కడ ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే సూసైడ్ బాంబర్ గా మారిన యువతి పేరు షారీ బలోచ్ (30). ఈమె జువాలజీలో ఎంఏ చదివటమే కాకుండా ఎంఫిల్ కూడా చేసింది. ప్రస్తుతం టీచర్ గా పనిచేస్తోంది. భర్త డెంటిస్ట్.

తండ్రి స్ధానికంగా ఉండే కాలేజీలో లెక్షిరర్. అంటే వీళ్ళది మంచి విద్యావంతుల కుటుంబమనే అర్ధమవుతోంది. పైగా వీళ్ళ కుటుంబానికి ఎలాంటి తీవ్రవాద నేపధ్యంలేదు. బలూచిస్ధాన్ నుండి చైనా వెళ్ళకపోతే మరిన్ని దాడులు తప్పవని బీఎల్ఏ హెచ్చరించింది.

అందరినీ కలవరపరుస్తున్న విషయం ఏమిటంటే బలూచ్ ఒక్కతే కాకుండా సూసైడ్ బాంబర్లు ఇంకా చాలామంది ఉన్నారట. బీఎల్ఏ లోని మజీద్ బ్రిగేడ్ లో సూసైడ్ బాంబర్లుగా రెడీ అయినవారు ఇంకా చాలామందే ఉన్నారట. అంటే వీళ్ళందరినీ చైనా, పాకిస్ధాన్ పైకి ప్రయోగించేందుకే మజీద్ బ్రిగేడ్ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. అంటే బలూచిస్ధాన్ లో తన కార్యకలాపాలను ఆపకపోతే ముందు ముందు డ్రాగన్ కు మరింతమంది సూసైడ్ బాంబర్లు చుక్కలు చూపించటం ఖాయమనే అనిపిస్తోంది.