Begin typing your search above and press return to search.
రేవంత్ ను ఆపితే కాంగ్రెస్ అధికారానికి దూరమైనట్టే?
By: Tupaki Desk | 3 Jan 2023 5:30 PM GMTతెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలుపుతానని కేసీఆర్ అన్నారు. ఆ చాన్స్ కూడా వినియోగించకుండా కాంగ్రెస్ నిండా మునిగింది. అటు ఏపీలో భూస్థాపితం అయ్యి.. ఇటు తెలంగాణలోనూ రెండు సార్లు అధికారానికి దూరమైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ల కుమ్ములాటలతో ఇప్పటికే పార్టీ భ్రష్టు పట్టింది. ఇక కునారిల్లుతున్న కాంగ్రెస్ ను లేపడానికి యువకుడైన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇచ్చారు. ఈయన వచ్చాక కాంగ్రెస్ కు జోష్ వచ్చింది. కొత్త రక్తం వచ్చి చేరింది. అయితే సీనియర్లు మాత్రం రేవంత్ కు అడుగడుగునా అడ్డుపడుతున్నారు.
ఎన్నికల ముందర పాదయాత్ర చేసి సీనియర్లను బుజ్జగించి పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చి అధికారం దిశగా నడిపించాలని రేవంత్ ప్లాన్ చేశారు. అయితే సీనియర్ల అభ్యంతరాలతో అధిష్టానం వెనక్కి తగ్గింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు అడ్డుచెప్పిందట.. ఇలా చేస్తే కాంగ్రెస్ నిండా మునగడం గ్యారెంటీ అని కాంగ్రెస్ వాదులు హెచ్చరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. హైదరాబాద్ లో అభియాన్ ముగింపు సభకు రాహుల్ గాంధీ వస్తారని.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
జనవరి 26 నుంచి జూన్ 2 వరకూ రేవంత్ తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు కొనసాగింపుగా పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావించారు.
అయితే అన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలే పాదయాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. అందుకే రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఏ నియోజకవర్గానికి ఆ నేతలే చేయాలని సూచించిందట..
కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే శక్తి కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది. ఆయనను కాదని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు నిండా మునగడం ఖాయం. ఇప్పుడే అదే జరగడం ఖాయమని.. రేవంత్ పాదయాత్రను అడ్డుకుంటే కాంగ్రెస్ ఓటమి తథ్యం అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.