Begin typing your search above and press return to search.
హైకోర్టు పీటముడి.. టీడీపీలో ఇదే హాట్ టాపిక్...!
By: Tupaki Desk | 17 Nov 2022 3:30 PM GMTతాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ.. నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు కు ఇక్కడ కొన్ని ప్రజాసంఘాల నుంచి ముఖ్యంగా న్యాయవాద సంఘాల నుంచి సెగ తగిలింది. ఎందుకంటే.. ఏపీలో అమరావతిని రాజధానిని చేసిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక్కడే హైకోర్టును కూడా ఏర్పా టు చేశారు. అయితే.. ఒకప్పటి శ్రీబాగ్ ఒప్పందం మేరకు.. ఈ హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని.. వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.
అంతేకాదు, కర్నూలును న్యాయ రాజధానిని చేస్తామని కూడా ప్రకటించింది. దీంతో కర్నూలు వాసుల్లో దీనిపై ఆశలు మొలిచాయి. దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయడం ప్రారంభం కాగానే.. హైకోర్టును తరలించేందుకు వీల్లేదంటూ.. కొందరు హైకోర్టులోనే కేసు వేశారు. అయితే, దీనివెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ.. వైసీపీనాయకులు ప్రచారం చేశారు. దీంతో ఇదే నిజమని అనుకున్న కర్నూలు ప్రజలు.. తాజాగా బాబుకు నిరసన తెలిపారు.
పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు ప్లకార్టులు పట్టుకుని.. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏమనుకున్నారో.. ఏమో.. తెలియదు కానీ, చంద్రబాబు పత్తికొండ సభలో మాట్లాడుతూ.. తాము హైకోర్టుకు అనుకూల మని ప్రకటించారు. అంతేకాదు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం తనకు కూడా ఇష్టమేనని చెప్పారు. ఈ పరిణామం.. టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఎందుకంటే.. ఇప్పటి వరకు తాము ఏపీ రాజధాని అంటే.. హైకోర్టుతో కూడిన అమరావతి అంటూ..ప్రచారం చేశారు.
దీనికే కట్టుబడ్డామని కూడా.. చెబుతూ..వచ్చారు. రైతులకు కూడా సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అలాంటి.. పరిస్థితి ఒక్కసారిగా.. మారిపోయిందని.. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన పార్టీని అటు అమరావతి రైతులకు.. దూరం చేస్తుందని వారు వాపోతున్నారు. హైకోర్టు అంశంపై మౌనంగా ఉండి ఉంటే బాగుండేదని.. కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో దానిని అలా వదిలేస్తే.. ఇబ్బంది లేకుండా పోయేదని అంటున్నారు.కానీ, ఇప్పుడు.. అటు అమరావతిలో తేడా వస్తే.. ఇప్పటి వరకు చేసిందంతా.. వేస్ట్ కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి దీనికి చంద్రబాబు ఎలాంటి రెమెడీ కనిబెడతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.