Begin typing your search above and press return to search.

తడబాట్లు...పొరపాట్లూ..బాబు గారూ ఇదీ వ్యూహమేనంటారా...?

By:  Tupaki Desk   |   6 Dec 2022 10:30 AM GMT
తడబాట్లు...పొరపాట్లూ..బాబు గారూ ఇదీ వ్యూహమేనంటారా...?
X
చంద్రబాబు అంటే వ్యూహాల పుట్ట అని పక్కన రాసుకోవాలి. అపర చాణక్యుడు అని మరో పేరు ఆయనకు ఉంది. ఆయన బుర్రలో ఒకేసారి పది సినిమాలు ఆడించే కెపాసిటీ ఉంది. అలాంటి బాబు ఇటీవల తడబడుతున్నారు. మాటలు జార్చేస్తున్నారు. అవి పొరపాటుగా వస్తున్నాయా లేక అలా చెప్పాలని ఫిక్స్ అయి అంటున్నారా అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు.

అయితే బాబు ఏం చేసినా నమ్మలేము అందులో కూడా ఏదో వ్యూహం ఉంటుంది అని అనుకునే వారే ఎక్కువ. దాంతో బాబు నిజంగా తప్పుగా మాట్లాడిగా లోతుగా ఆలోచించే వారే ఉంటారు. ఇంతకీ బాబు బ్యాలన్స్ తప్పి మాట్లాడుతున్న మాటలు ఏంటో ఒక్కసారి చూస్తే రీసెంట్ గా కొన్ని కనిపిస్తాయి. ఆయన కర్నూల్ జిల్లా టూర్ కి వెళ్ళినపుడు తనకు ఇవే ఆఖరు ఎన్నికలు అన్నారు. అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ వైసీపీ దాన్ని అస్త్రంగా చేసుకుంది.

పోనీ ఎవరేమి చేసుకున్నా తన మాటలకు ఆయన కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. గోదావరి జిల్లాలకు రాగానే బాబు టోన్ మారింది. అబ్బెబ్బే నాకు కాదు రాష్ట్రానికే చివరి ఎన్నికలు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దాంతో బాబు గారి మాటలు మడతేశారా అన్న చర్చ మొదలైంది. ఇక బాబు ఇదే టూర్లో మాజీ మంత్రి నారాయణ గురించి మాట్లాడుతూ ఆయన మెడ మీద కత్తి పెట్టి మరీ టీడీపీలో చేరాలని వైసీపీ వారు బలవంతం చేస్తున్నారు అని మాట్లాడేశారు.

నారాయణ టీడీపీలోనే ఉన్నారు. ఆయన మెడమీద కత్తిపెట్టి అదే పార్టీలో చేరమనడమేంటి. అంటే వైసీపీలో అని అక్కడ అనాలి. కానీ బాబు తడబాటులో పొరపాటుగా మాట్లాడారు అన్న మాట. ఇక బాబు కర్నూల్ టూర్ కానీ వేరే జిల్లాల టూర్ కానీ ఈ మధ్య చూస్తే వైసీపీ వారిని విమర్శించే క్రమంలో కొంత అనుచితమైన భాష వాడుతున్నారు. గుడ్డలూడదీయించి కొట్టిస్తాను అంటున్నారు. నేను మీ కంటే పెద్ద రౌడీని అని చెబుతున్నారు. నాతో పెట్టుకుంటే ఏం చేస్తానో తెలుసా అని కూడా హూంకరిస్తున్నారు.

నిజానికి బాబు ఎపుడూ హుందాగా మాట్లాడుతారు. బజారు భాష ఆయన నోటి వెంట రాదు, అలాంటి బాబు ఇలా చిల్లరగా మాట్లాడమేంటి అని తటస్థ జనాలు మేధావులూ ఆశ్చర్యపోయే పరిస్థితి. సరే వైసీపీ నేతలు కొందరు అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ ముమ్మారు సీఎం గా చేసిన బాబు నోటి వెంట అలాంటి మాటలు వినడానికి జనాలకే చికాకుగా ఉంటుంది. కానీ బాబు అలా అనుకోవడంలేదు, తాను గట్టిగా మాట్లాడితే తమ్ముళ్లు చప్పట్లు కొడతారు. తన భాష బాడీ లాంగ్వేజ్ మారిస్తే కరెంట్ పాలిటిక్స్ కి మ్యాచ్ అవుతుంది అని భ్రమలో ఉన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.

ఇక గత ఏడాది బాబు అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ బోరున ఏడ్చారు. నా భార్యను వాళ్ళు అనుచితంగా మాట్లాడారు అని కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా తరువాత బూమరాంగ్ అయింది. వాళ్ళు ఏదో అనడమేంటి, అంతటి పెద్దాయన యాక్షన్ కి దిగకుండా బోరున అమాయకంగా బేలగా ఏడవడం ఏంటి అని అనుకున్నారు. బాబు లాంటి పొలిటీషియన్ కి ఈ ఏడుపులు నప్పవని కూడా అనుకున్నారు. అయినా అదొక వ్యూహంగా బాబు ఈ రోజుకీ సభలలో మాట్లాడుతూనే ఉన్నారు. మరి అది బాబుకు ఏ రకమైన రాజకీయ ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే బాబు బాడీ లాంగ్వేజ్ నుంచి భాష నుంచి అన్నీ మార్చేశారు. అయితే ఆయన ఏజ్ కి ఆయన పొలిటికల్ హిస్టరీకి, ఆయన ఇమేజ్ కి ఆయన హోదాకు ఏ మాత్రం అది సూట్ అవడంలేదు అని పార్టీలోనే చర్చగా ఉంది. కర్నూల్ మీటింగులో బాబు వ్యవహరించిన తీరు, అన్న మాటలు పార్టీలోనే చర్చకు దారి తీసాయి. అయితే బాబు మాత్రం తనలోని ఈ కొత్త మార్పు ఫుల్ బెనిఫిట్ అవుతుంది అని నమ్ముతున్నట్లున్నారు. మరి ఆయన వ్యూహాలు ఆయనవి. అవి సక్సెస్ అవుతాయా లేదా అన్నది మాత్రం తెలియాలి అంటే వేచి చూడాల్సి ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.