Begin typing your search above and press return to search.
కఠిన బాబు...ఇది పక్కా...!
By: Tupaki Desk | 15 Jan 2023 4:30 AM GMTచంద్రబాబు మరో రూపం చూపిస్తాను అని అంటున్న్నారు. చంద్రబాబు అంటే అందరికీ ఒక రకమైన భావన ఉంది. ఆయన మొహమాటస్తుడు అని సున్నితంగా ఉంటారని. అంతే కాదు, చంద్రబాబుని ఎన్ని మాటలు అన్నా కూడా ఆయా నాయకులు ఆయన దగ్గరకు చేరగానే తిరిగి ఎలాంటి ఆలోచనల లేకుండా దరి చేర్చుకుంటారు అని అంటారు.
రాజకీయాల్లో ఇది మంచి లక్షణం అని ఎంత అనుకున్నా మారుతున్న కాలంతో పాటు బాబు మారకపోవడం వల్ల ఆయన్ని లైట్ తీసుకునే వారే ఎక్కువగా ఉన్నారు. అది పార్టీలో అయినా బయట అయినా బాబు హెచ్చరికలు కానీ ఆయన ఇచ్చిన స్టెట్మెంట్స్ కానీ ఎవరూ సీరియస్ గా తీసుకోవడం మానేశారు.
బహుశా ఇదొక కారణం కావచ్చు. బాబు తాను మారుతాను అని తరచూ అనడానికి. ఇక రెండవ కారణం తీసుకుంటే ఆయన కళ్ల ముందే జగన్ ఉన్నారు. ఆయన పొలిటికల్ స్కూల్ వేరు. తనను మాటలని పార్టీని వదిలి వెళ్ళిపోయిన వారు ఎంతటి పెద్ద వారు అయినా జగన్ మళ్లీ దగ్గరకు తీయరు. అంతే కాదు, వారి విషయంలో అదే కఠినత్వంతో ఉంటారు.
అందువల్ల వైసీపీని వీడిపోయేవారు ఎవరైనా ఉంటే ఇక శాశ్వతంగా ఆ పార్టీకి గుడ్ బై కొట్టేయాల్సిందే. మళ్లీ బాగుంటే వచ్చి చేరడానికి అక్కడ డోర్స్ తెరచుకోవు. ఈ కీలక కారణం వల్ల చాలా మంది నాయకులు వైసీపీని వీడేందుకు చాలా చాలా ఆలోచిస్తారు అని అంటారు. ఇక వెళ్ళిపోయే వారు ముందే చెప్పుకున్నట్లుగా అన్నీ తెగించే సిద్ధం అవుతారు.
జగన్ పార్టీ అధినేతగా ఇంతటి కఠిన వైఖరిని తీసుకుంటారు. అదే జగన్ ప్రభుత్వ అధినేతగా చూస్తే ప్రత్యర్ధుల విషయంలో నిప్పులే కురిపిస్తారు. ప్రత్యర్ధిని చీల్చి చెండాడుతారు. వారిని ఎక్కడా లైట్ తీసుకోరు. ఆ తరువాత వచ్చే పరిణామాలు పర్యవశానాలు అసలు ఆలోచించరు.
ఈ లక్షణం వల్ల జగన్ తన పార్టీ వారికి ఒక సిం హంగా కనిపిస్తారు. అదే ప్రత్యర్ధులకు కూడా అరవీర భయంకరుడుగా ఉంటారు. ఫక్తు రాజకీయమే జగన్ అమలు చేస్తారు. ఆ లైన్ దాటి ఆయన రారు. అని అంతా అంటారు. జగన్ సీఎం అయ్యాక ఆయన పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి అన్నది ప్రత్యక్షంగా చవి చూసిన పార్టీ తెలుగుదేశం.
గత నాలుగేళ్లలో తెలుగుదేశం పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా జగన్ సర్కార్ పెట్టింది అని తమ్ముళ్ళు అంటారు. ఈ విషయంలో చంద్రబాబు సీఎం గా ఉన్న వేళ చూసీ చూడనట్లుగా ఉండేవారు అన్న ఫీలింగ్ అయింతే తమ్ముళ్ళలో ఉంది.
దాంతో ముఖ్యమంత్రిగా జగన్ నూరు శాతం పవర్ చూపిస్తే చంద్రబాబు సున్నితతత్వం వల్ల కానీయండి, లేదా రాజకీయ ఆలోచనల వల్ల కానీయండి ఒక లో ప్రొఫైల్ లోనే వెళ్లేవారు. ఇది తమ్ముళ్లకు నచ్చడంలేదు జగన్ ని చూసిన వారు తాము అధికారంలోకి వస్తే దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వడ్డీలతో సహా అసలును చెల్లించమంటున్నరు.
దాంతోనే బాబు టోన్ మారుతోంది. ఇటీవల కాలంలో ఆయన అంటున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. నేను మారిపోయాను. ఇక మీదట కఠినంగా ఉంటాను అని తాజాగా పండుగ వేళ కూడా బాబు మరోసారి గర్జించారు. నేను అధికారంలోకి వస్తే అందరి లెక్కలూ తేలుస్తాను అంటున్నారు ఆయన డైరెక్ట్ వార్నింగ్ చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చిన టోటల్ ఏపీ వైసీపీ నేతలకే ఇచ్చారు అనుకోవాలి.
అదే టైం లో తమ్ముళ్లలో బూస్ట్ నింపే ప్రయత్నం చేశారు. మరి బాబు కఠినంగా ఉంటే ప్రత్యర్ధి పార్టీలకే కాదు సొంత పార్టీల నేతలకూ ఇబ్బందే. మరి బాబు ఆ విధంగా ఉండగలరా. ఏడున్నర పదుల వయసు దాకా ఒకే బాణీలో సాగిన బాబు రాజకీయం ఈ ముదిమి వయసులో మారుతుందా అంటే చూడాలనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.