Begin typing your search above and press return to search.
బాబు ప్రకటన బాగున్నా.. మాజీ మంత్రి తర్జన భర్జన ఏమంటున్నారంటే!
By: Tupaki Desk | 21 Sep 2022 3:30 AM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఎప్పుడూ.. ఏదో ఒక వెలితి కనిపిస్తూనే ఉంది. అది నాయకుల లోపమా.. లేక పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహమో తెలియదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం చాలా విషయాల్లో ఇప్పటికీ తర్జన భర్జనలోనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా.. సంచలన ప్రకటన చేశారు. సిట్టింగులుగా ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ టికెట్ ఇస్తామన్నారు. దీంతో దాదాపు పార్టీలో జోష్ వచ్చింది. నాయకులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాత్రం అంతర్మథనంలో పడ్డారు.
వాస్తవానికి ఇప్పటి వరకు జిల్లాలో శెట్టిబలిజ, కమ్మ సామాజికవర్గాలకు కచ్చితంగా జిల్లాలో సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అధిష్ఠానం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. కాకినాడ రూరల్ స్థానం శెట్టిబలిజలకే ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారు. కమ్మ సామాజికవర్గంనుంచి ఒత్తిళ్లు తీవ్రంగా ఉండడంతో ఎక్కడ? ఎలా? కేటాయింపు చేస్తారనేది సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు అధికార వైసీపీపై ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది టీడీపీ నేతల వాదన. సొంతంగా పార్టీ నిర్వహిస్తున్న సర్వేలు, పీకే బృందం సర్వేల్లోను ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు గుర్రుగా ఉన్నట్లు నివేదికలు అందుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సిట్టింగులకే సీట్లు అంటూ.. వ్యూహాత్మకంగా ప్రకటన చేశారు. నిజానికి గతంలో అభ్యర్థుల ఖరారులో ఉన్న నాన్చుడు ధోరణికి భిన్నంగా ఈసారి వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో టీడీపీలో కోలాహలం నెలకొంది. అయితే..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి పెద్దాపురం నుంచి రాజప్ప ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో బాబు ప్రకటనతో ఆయనకు సీటు ఖాయమైనట్టే అనుకోవాలి. అయితే.. ఆయనకు ఈ విషయం తెలిసి కూడా తర్జన భర్జన పడుతున్నారట.
ఎందుకంటే.. తనకు సీటు ఖరారైనా అదే స్థానంలో కొనసాగిస్తారా? లేదా పార్టీ అవసరాలు, సమీకరణాల రిత్యా వేరే చోటకు పంపిస్తారా? అని ఆయన తన అనుచరులతో చెప్పుకొంటున్నారని చర్చ జరుగుతోంది. దీనికి కూడా ఒకకారణం కనిపిస్తోంది. కీలకమైన కాకినాడ ఎంపీ స్థానానికి టీడీపీకి అభ్యర్థి కొరత ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన చలమశెట్టి సునీల్ ఓటమి తర్వాత పార్టీని వీడారు. ఆ తర్వాత ఇప్పటికీ అభ్యర్థి లేరు. సామాజిక సమీకరణాల కోణంలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న రాజప్పను ప్రత్యామ్నాయంగా అక్కడి పంపించే అవకాశం ఉందని.. భావిస్తున్నారు.
పోనీ.. ఇది కాకపోయినా.. వేరే నియోకజకవర్గంలో సేవలను వినియోగిం చుకుంటారనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ కనుక సర్దు మణిగితే.. ప్రస్తుతం ఉన్న పెద్దాపురంలోనే ఆయన ఉంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజప్ర తర్జన భర్జన పడుతున్నారు. ``ఓకే.. సిట్టింగులకు సీటు ఖాయం అన్నారు బాగానే ఉంది. కానీ, ఎక్కడిస్తారో.. కూడా చెప్పేస్తే. పార్టీని బలోపేతం చేసుకుంటాం కదా! అలా కాకుండా.. ఎన్నికలకు ముందు ప్రకటిస్తే.. ఏంటి ప్రయోజనం.. `` అని రాజప్ప కీలక అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించారు. సో.. దీనిని బట్టి చంద్రబాబు ప్రకటించినా.. తమ్ముళ్లలో మాత్రం తర్జన భర్జన పోలేదన్నమాట అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.