Begin typing your search above and press return to search.

విశాఖ ఆక్టోపస్ టీడీపీ ఓటమిని ఊహించేశారా...?

By:  Tupaki Desk   |   29 Nov 2022 2:30 AM GMT
విశాఖ ఆక్టోపస్ టీడీపీ ఓటమిని ఊహించేశారా...?
X
ఆయనకు విశాఖ ఆక్టోపస్ గా పేరుంది. ఆయన ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది ఇవన్నీ బాగా అంచనా కట్టగలరు అని అంటారు. ఆయనే మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. ఆయన ఎపుడూ ఓడిపోలేదు. అదే విధంగా ఎపుడూ అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నారు. ఇక ఆయన అంచనాలు ఎపుడూ కరెక్ట్ అయ్యాయి. కొన్ని సందర్భాలలో అన్నీ తెలిసి కూడా ఆయన తాను ఉన్న చోటనే ఉండిపోవాల్సి వచ్చింది అని సన్నిహితులు చెబుతారు.

అలా ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ చేయాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపె గెలిచి తీరుతుంది అని ఆయన ముందే అంచనాకు వచ్చారు. సరైన టైం చూసి పార్టీ మారాలని అనుకున్నారని చెబుతారు. ఆ విషయం సన్నిహితుడు అవంతి శ్రీనివాసరావుకు కూడా తెలుసు అని, గంటాతో పాటు పార్టీ మారితే మరోసారి ఆయనే మంత్రి అవుతారు తాను ఎప్పటికీ కాలేను అన్న లెక్కలతోనే ఆయన గంటాతో విభేదించి ముందే వైసీపీ గూటికి చేరుకుని తాను అనుకున్నట్లుగా మంత్రి అయిపోయారు అని చెబుతారు.

ఆ తరువాత కూడా గంటా వైసీపీలోకి రావాలని చూసినా అవంతి అడ్డుకున్నారు అని అంటారు. దీంతో ఆయన విపక్షంలో మూడున్నరేళ్ల పాటు ఉన్నారని అంటారు. ఇక గంటా తొందరలోనే వైసీపీలోకి చేరుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో దీని వెనక కూడా ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గంటా ఎపుడూ గెలిచే పార్టీలోనే ఉంటారు. ఆయన దాని మీద తనదైన సర్వేలు పరిశోధనలు చేయించుకుని జనాల మూడ్ తెలుసుకునే పార్టీ మారుతారు కదా ఇపుడు ఆయన వైసీపీలోకి వస్తున్నారు అన్న ప్రచారం నిజమైతే ఆయన అంచనాలు ఏమిటీ అని కూడా జనాలలో చర్చ సాగుతోంది.

ఏపీలో తామే కచ్చితంగా అధికారంలోకి వస్తామని టీడీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. అనంతపురంలో ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత నుంచి శ్రీకాకుళంలో ఉన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు వరకూ మేము అధికారంలోకి వస్తే వైసీపీ వారిని వదలం అంటూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్న నేపధ్యం ఒక వైపు ఉంది. అదే విధంగా చంద్రబాబు కూడా తమ పార్టీ గెలీచి తీరుతుందని, తాను అందరి జాతకాలూ చూస్తాను అంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు.

ఈ మధ్యనే కర్నూల్ లో జరిగిన బాబు రోడ్ షోకు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరి ఈ క్రమంలో చూస్తే టీడీపీకి వేవ్ ఉందని భావించాలి కదా. అలాగే ఏపీలో వైసీపీకి తీవ్ర వ్యతిరకత ఉందని కూడా విపక్షాలు రోజుకు వందల సార్లు చెబుతున్నది కూడా గంటా వంటి వారి చెవికి చేరక ఉంటాయా అన్నది కూడా మాటగా ఉంది. అయినా సరే గంటా కనుక వైసీపీలోకి వచ్చి చేరితే మారితే మాత్రం ఏపీలో తీరిగి వచ్చేది వైసీపీయే అని ఆయన అంచనా కట్టినట్లు అని అంటున్నారు.

అదే టైం లో టీడీపీ ఓటమిని ముందే ఊహించి గంటా పార్టీ మారుతున్నారు అని కూడా లెక్కేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఆంధ్రా అక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాదిరిగానే గంటాకు కూడా మంచి నెట్ వర్క్ ఉంది అంటారు. ఆయన సైతం గెలిచే పార్టీ ఫలానా అని ఎన్నికలకు కొంతకాలం ముందు అంచనా కడతారు అని చెబుతున్నారు. అలాంటి గంటా టీడీపీ వైపు చూడకుండా ఆ పార్టీ మీటింగ్స్ కి అటెండ్ కాకుండా ఉంటున్నారు అంటే ఆ పార్టీ గెలవదు అన్న డౌట్లు ఏమైనా ఆయనకు ఉన్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. మరి దీనికి గంటా కనుక వైసీపీలో చేరితే కచ్చితమైన జవాబు వస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.