Begin typing your search above and press return to search.
టీడీపీకి కళా దూరమేనా. ... ఏం చేయబోతున్నారు...?
By: Tupaki Desk | 12 Aug 2022 2:17 PM GMTతెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి ఉన్న నాయకుడు ఆయన. ఎన్నో కీలక పదవులు నిర్వహించిన వారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో హోం శాఖ వంటి కీలకమైన పదవిని ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన చేపట్టారు. ఇక ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గిన వారు. నాలుగు దశాబ్దాల పై చిలుకు రాజకీయ చరిత్ర కలిగిన కిమిడి కళా వెంకటరావు ఇపుడు టీడీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఆయనను విభజన ఏపీలో తొలి టీడీపీ ప్రెసిడెంట్ గా చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత విద్యుత్ శాఖ మంత్రిగా కూడా చాన్స్ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో కళా హవా రాను రాను తగ్గిపోతోంది. కింజరాపు ఫ్యామిలీదే పై చేయిగా ఉంది. ఎర్రన్నాయుడు సమకాలికుడు అయిన కళా వెంకటరావు ఆయనతో పోటీ పడి జిల్లాలో పాలిటిక్స్ చేసేవారు. ఎర్రన్న చంద్రబాబు వర్గంలో ఉంటే కళా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైపుగా ఉంటూ జిల్లాలో ఆధిపత్యం చలాయించేవారు. 1995లో పార్టీ చంద్రబాబు పరం కావడంతో ఆయన కూడా బాబు వైపే ఉన్నారు.
క్రమంగా కళా బాబు మన్ననలు కూడా చూరగొన్నారు. అయితే ఎంత చేసినా శ్రీకాకుళం జిల్లా అంటే కింజరాపు ఫ్యామిలీయే అని టీడీపీలో ముద్ర పడిపోయింది. ఎర్రన్న అస్తమయం తరువాత తమ్ముడు అచ్చెన్నాయుడు ఆ పార్టీ జెండా ఎత్తుకున్నారు. ఇపుడు ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా దూకుడు చేస్తున్నారు. కళా వెంకటరావు బలం అయితే జిల్లాలో బాగా తగ్గిపోయింది. ఎచ్చెర్ల, రాజాం, పాలకొండలలో ఆయనకు పట్టు ఉంది. అయితే రాజాం, పాలకొండ విజయనగరంలో చేరిపోయాయి.
మరో వైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడు కళా పట్టు తగ్గించేందుకు ఆయన ఉన్న నియోజకవర్గాలలో కూడా వేలు పెడుతున్నారని ప్రచారంలో ఉంది. దంతో కళా వర్గం మండుతోంది. దీని మీద పంచాయతీలు ఎన్ని జరిగినా అధినాయకత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో పాటు కళా తమ కుమారుడు రామ మల్లిక్ నాయుడుని 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు. దానికి కూడా హై కమాండ్ నుంచి భరోసా దక్కలేదని అంటున్నారు. ఇటీవల పార్టీ పెద్దలను కళా కలసినా వారి నుంచి సరైన స్పందన రాలేదని అంటున్నారు.
దాంతో కళా సడెన్ గా సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. మునుపటి మాదిరిగా ఆయన నుంచి జగన్ సర్కార్ మీద విమర్శలు కానీ కామెంట్స్ కానీ ఇపుడు రావడంలేదు. దాంతో పెద్దాయన ఏం చేయబోతున్నారు అన్న చర్చ అయితే జిల్లాలో ఉంది. అయితే కళా పార్టీ మారుతారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీకి కూడా ఉత్తరాంధ్రాలో కీలకమైన నేతలు కావాలి. దాంతో కళా వంటి వారు వస్తే వారు అక్కున చేర్చుకుంటారు అని అంటున్నారు. అయితే బీజేపీకి పెద్దగా బలం లేదు.
మరి కళా బీజేపీలోకి వెళ్తారా లేక వైసీపీ వైపు ఏమైనా చూస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కళా ప్రభలు టీడీపీలో తగ్గిపోవడం వల్లనే ఆయన పార్టీ మారుతున్నారు అని అంటున్నారు. ఇకపోతే కళా వెంకటరావు గతంలో కూడా ఒకసారి పార్టీ మారారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికలో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ఓడారు. అందువల్ల ఈసారి కూడా ఆయన పార్టీ మార్పు అన్నది ఖాయమే అంటున్నారు. చూడాలి మరి కళా కాంతులు ఏ పార్టీ ఇస్తుందో. గత వైభవం కళాకు ఏ పార్టీ ద్వారా వస్తుందో అన్నది.