Begin typing your search above and press return to search.

అచ్చెన్న బ‌స్సు యాత్ర‌.. సైకిల్ జోరు పెంచేనా?

By:  Tupaki Desk   |   23 July 2022 1:14 PM GMT
అచ్చెన్న బ‌స్సు యాత్ర‌.. సైకిల్ జోరు పెంచేనా?
X
రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాల‌ని.. ఆ పార్టీ నాయ‌కులు కంక‌ణం క‌ట్టుకు న్నారు. చంద్ర‌బాబును మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈక్ర‌మంలోనే చిన్న‌పామునైనా.

పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌నే చందంగా.. వైసీపీని ఎదుర్కొనేందుకు యాత్ర‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ యాత్ర‌ల ప‌రంప‌ర‌లో కింజ‌రాపు అచ్చెన్నాయుడు కూడా.. బ‌స్సు యాత్ర చేస్తే... పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ నేత‌లు సూచిస్తున్నారని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బీసీల్లో కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి సాధించ‌డంతోపాటు.. బీసీ వ‌ర్గానికి మ‌రింత చేరువ అయ్యేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే అచ్చెన్న  చేసే బ‌స్సు యాత్ర‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే.. దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు జిల్లాల యాత్ర‌లు.. సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఆయ‌న కుమారుడు పార్టీ కీల‌క‌యువ నేత‌ నారా లోకేష్ పాద‌యాత్ర‌కు రంగం సిద్ధం అవుతోంద‌నే చ‌ర్చ ఉంది.

ఈ క్ర‌మంలో... బీసీల‌ను మ‌రింత చేరువ చేసేందుకు పార్టీ తిరిగి పున‌ర్వైభ‌వం పొందేందుకు పార్టీ ఏపీ అధ్య‌క్షుడి హోదాలో అచ్చెన్నాయుడు వంటి బ‌ల‌మైన బీసీ నాయ‌కుడు కూడా ప్ర‌జ‌ల‌మ‌ధ్య‌కు యాత్ర రూపంలో వ‌స్తే.. ఆ ఎఫెక్ట్ పీక్ స్టేజ్‌లో ఉంటుంద‌ని పార్టీలో సీనియ‌ర్లు ఒక చ‌ర్చకు తెర‌దీశారు.  

మేలో నిర్వ‌హించిన మ‌హానాడులో అచ్చెన్నాయుడు ఒక సంచ‌ల‌నాత్మ‌క‌మైన శ‌ప‌థం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ 175కి 160 సీట్లు సాధించుకుని అధికారంలోకి వ‌స్తుంద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే.. ఇదేమీ చిన్న ల‌క్ష్యం కాదు.. అలాగ‌ని సాధించ‌లేని ల‌క్ష్యం కూడా కాదు. ఈక్రమంలో ఈ శ‌ప‌థం నెర‌వేరాలంటే.. అచ్చెన్న మ‌రింత‌గా న‌డుం బిగించాల‌ని, అన్ని వ‌ర్గాల‌ను పార్టీకి చేరువ చేయ‌డంతోపా టు.. ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. త‌గిన విధంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాల‌ని సీనియ‌ర్లు య‌న‌మ‌ల రామకృష్ణుడు.. వంటి ఉద్ధండులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీసీల కోసం అచ్చెన్న కూడా యాత్ర స్టార్ట్ చేయొచ్చ‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. తెలుగు దేశంలో మొత్తం యాత్ర‌లే క‌నిపించ‌నున్నాయి.