Begin typing your search above and press return to search.
పయ్యావుల : సంచలనమే అంటున్నారు...ఏంటది...?
By: Tupaki Desk | 13 July 2022 2:30 AM GMTఆయన టీడీపీకి రాయలసీమ జిల్లాలలో స్ట్రాంగ్ లీడర్. ఆయన సీనియారిటీ ప్రకారం ఏనాడో మంత్రి కావాల్సిన వారు. కానీ చిత్రమేంటి అంటే ఆయన గెలిచినపుడు పార్టీ గెలవదు, పార్టీ గెలిచినపుడు ఆయన గెలవడు. అయినా తన బాధను అసంతృప్తిని పక్కన పెట్టేసి ఎపుడు టీడీపీ గెలుపు కోసం పనిచేసే శ్రామికుడు ఆయన. ఆయన పేరే పయ్యావుల కేశవ్.
ఆయన ప్రస్తుతం ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా క్యాబినేట్ ర్యాంక్ పదవిలో ఉన్నారు. అంతే కాదు తనకు ప్రాణ హాని ఉందని ఆయన గతంలో డీజీపీకి రాసిన లేఖ కూడా ఉంది. ఇక ఆయనకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ప్రభుత్వం కేటాయించింది. అయితే అది చాలదు టూ ప్లస్ టూ కావాలని పయ్యావుల కోరుతూ వస్తున్నారు.
ఆ సంగతి పట్టించుకోకుండా సడెన్ గా ఆయన సెక్యూరిటీని మొత్తానికి మొత్తం తగ్గించడం పట్ల టీడీపీ మండిపోతోంది. అసలే రాయలసీమ ప్రాంతం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. విపక్ష ఎమ్మెల్యే. పైగా ఆయన నిత్యం వైసీపీ సర్కార్ మీద విమర్శలు సంధిస్తున్నారు. ఇక చూస్తే పయ్యావుల ఈ మధ్యనే ప్రభుత్వం మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
అదేంటి అంటే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీదనే వైసీపీ సర్కార్ నిఘా పెడుతోందని, దీని మీద నిజాలు కావాలంటే సెంట్రకల్ ఏజెన్సీల చేత విచారణ జరిపించుకోండని సవాల్ కూడా చేశారు. ఈ నేపధ్యంలో ఆయనకు గన్ మెన్స్ తీసేస్తూ ప్రభుత్వం నిర్ణయించిందా అన్నదే టీడీపీలో చర్చ.
ఇకపోతే తన వద్దకు ఒక కొత్త గన్ మెన్ వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడని, కానీ తనకు యూనీఫారంలో ఉన్న ఆర్ ఐ వచ్చి కొత్త గన్ మెన్ల గురించి చెబితే తాను కొత్త గన్ మెన్లను విధులలో చేరమని చెప్పానని, కానీ అతను మళ్లీ రాలేదని పయ్యావుల అంటున్నారు. మరి ఇంతకీ ఆ కొత్త గన్ మెన్ ఎవరు, ఏం జరుగుతోంది అన్నది తెలియాలీ అని టీడీపీ నేతలు అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే త్వరలో అంటే రెండు రోజులలో ప్రభుత్వం గురించి సంచలన విషయాల బయటపెడతాను అని పయ్యావుల చెప్పడం ఇపుడు రాజకీయ వర్గాలలో చర్చగా ఉంది. రచ్చగానూ ఉంది. మరి ఏం ఆయన పెదవి విప్పి ఏం చెబుతారు అన్నదే ఇపుడు అంతటా ఆసక్తిగా ఉంది. పయ్యావుల సాధారణంగా అన్నీ గణాంకాలతో సహా చెబుతారు కాబట్టి ఆయన చెప్పే విషయం చాలా కీలకంగా ఉంటుందనే అంతా భావిస్తునారు.