Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై తీవ్ర వ‌త్తిడి.. లోకేష్‌తో వివాదం!

By:  Tupaki Desk   |   24 Nov 2022 1:30 AM GMT
చంద్ర‌బాబుపై తీవ్ర వ‌త్తిడి.. లోకేష్‌తో వివాదం!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై పార్టీ నేత‌ల నుంచి తీవ్రస్థాయిలో వ‌త్తిడి పెరుగుతోంది. నిజానికి 2019 ఎ న్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. చంద్ర‌బాబుపై స‌హ‌జంగానే ఒత్తిడి పెరిగింది. చాలా మంది నాయ‌కులు పార్టీలో ఉన్నా త‌ట‌స్థంగా ఉండ‌డం, న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం. మ‌రికొంద‌రు త‌న వారే.. త‌న కుటుంబంపై విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివి చంద్ర‌బాబుకు వ‌త్తిడి తెచ్చాయి.

ఇక, ఇప్పుడు మ‌రో రూపంలో కూడా చంద్ర‌బాబుపై తీవ్ర వ‌త్తిడి పెరిగింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల రెండు విష‌యాల్లో చంద్ర‌బాబు చేసిన ప‌నిని త‌మ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నార‌ట‌. దీనిపై ఆయ‌న‌ను తాజాగా గ‌ట్టిగానేనిల‌దీసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా నిల‌దీసిన వారిలో కీల‌క నేత‌లు.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వంటి వారు కూడా ఉన్నార‌ని అంటున్నారు.

ఏం జ‌రిగిందంటే.. డిసెంబ‌రు 1వ తారీకు నుంచి టీడీపీ వినూత్నంగా.. `ఇదేం ఖ‌ర్మ` అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తోంది. ఆ రోజు చంద్ర‌బాబు ఏదో ఒక జిల్లాలో(ఇంకా నిర్ణ‌యించ‌లేదు) దీనిని ప్రారంభిస్తారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా దీనిని ముందుకు తీసుకువెళ్ల‌నున్నారు. అయితే.. ఈ పేరు విష‌యంలో కొన్నాళ్లుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న క‌నిపిస్తూనే ఉంది. ఇక‌, చివ‌ర‌కు దీనిని నిర్ధారించినా.. దీనిపైనా.. త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు.

ఇదేం పేరు.. మార్చాల్సిందే అని టీడీపీ డిజిట‌ల్ మీడియాకు.. దాదాపు వెయ్యి మెయిళ్లువ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కార్య‌క్ర‌మం పేరును మార్చాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక‌, లాస్ట్ ఛాన్స్ అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి, ఆయ‌న కుమారుడు లోకేష్ మండిప‌డుతున్నార‌ని అంటున్నారు.

దీనిపై చంద్ర‌బాబుకు-నారా లోకేష్‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం, ర‌గ‌డ కూడా జ‌రిగింద‌ని.. హైద‌రాబాద్లోని సొంత ఇంట్లోనే వారు గొడవ ప‌డ్డార‌ని.. టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో నారా భువ‌నేశ్వ‌రి స‌ర్దిచెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబుపై ఒత్తిడి పెరుగుతోంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.