Begin typing your search above and press return to search.
బాబా మజాకా : ఏపీ అంతా సర్దేసుకుంటున్నారు...?
By: Tupaki Desk | 26 Aug 2022 3:30 AM GMTఏపీలోనే కాదు జాతీయ రాజకీయాలలో కూడా చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఈ మాట చెప్పడానికి ఎవరికీ ఎలాంటి డౌటూ అక్కరలేదు. ఎర్లీ సెవెంటీస్ లో పాలిటిక్స్ స్టార్ట్ చేసి ఈ రోజుకీ చురుకుగా కంటిన్యూ అవుతున్న వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ లేరు. పైగా గత మూడు దశాబ్దాలకు పైగా ఫోర్ ఫ్రంట్ లో ఉంటూ అగ్రశ్రేణి నాయకునిగా బాబు పాలిటిక్స్ చేస్తున్నారు. పార్టీ పెట్టిన ఎన్టీయార్ కంటే కూడా సీఎం గానూ టీడీపీ ప్రెసిడెంట్ గానూ రెట్టింపు కాలం పనిచేసి టీడీపీ అంటే నాది అని చెప్పకనే చెప్పేశారు బాబు.
ఇక చంద్రబాబు ఎన్నికల వ్యూహాలు ఒక్కో ఎన్నికలో ఒక్కో విధంగా ఉంటాయి. 2019 ఎన్నికల ముందు బీజేపీని ధర్మ పోరాటం పేరిట కార్నర్ చేసి జగన్ని కూడా కలిపి ఇరికించాలని చూసిన బాబు మార్క్ స్ట్రాటజీ బెడిసికొట్టింది. అయితే ఈసారి ఆయన రూట్ మార్చారు. బీజేపీతో మచ్చిక చేసుకుంటున్నారు. జగనే తనకు ఎప్పటికీ ప్రత్యర్ధి అని తెలుసుకున్నారు. ఆ దిశగా పక్కా ప్లాన్ వేసుకుని సరిగ్గా నేల మీదనే నిలిచి మరీ వైసీపీ మీద బాణాలు వేస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి. ఆ విషయం టీడీపీ కంటే కూడా ఎవరికీ ఎక్కువగా తెలియదు అంటే తప్పు కూడా కాదు. ఇక ఏపీలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. అలాగే కీలమైన ఉప ప్రాంతాలు నాలుగు ఉన్నాయి. ఈసారి ఏపీని మొత్తం చుట్టేసి కమ్మేయాలని బాబు ప్లాన్. దానికి తగినట్లుగా ఏపీ అంతా టూర్లు చీసేందుకు ఆయన తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసిపెట్టుకున్నారు. దాంతో పాటు ఆయా ప్రాంతాలకు ఫ్యామిలీ తరఫున కూడా పెద్దలను రెడీ చేసి ఉంచారు. అంటే ఏపీలో సబ్ రీజియన్ ప్రాంతాలను బాబు ఫ్యామిలీ పంచుకుంటోంది అన్నమాట.
దీని వల్ల ఎక్కడా ఏ ఒక్క తప్పూ జరగకుండా చూసుకోవడమే కాకుండా ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలు అవుతుందని బ్రహ్మాండమైన పధక రచనను బాబు సిద్ధం చేసి ఉంచారు. దీని ప్రకారం చూస్తే గ్రేటర్ రాయలసీమగా చెప్పబడుగున్న ఆరు జిల్లాలలో చంద్రబాబు, ఆయన బావమరిది ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ చేరో వైపు నిలబడి కొమ్ము కాస్తారు. రాయలసీమ బాబు సొంత గడ్డ అయితే బాలయ్యకు అక్కడ ఒక లెక్కన సినీ గ్లామర్ ఉంది.
ఈసారి బాలయ్యని కేవలం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంచకుండా రాయలసీమలో నందమూరి ఫ్యాన్స్ బలాన్ని బలగాన్ని మొత్తంగా వాడుకోవాలని బాబు చూస్తున్నారుట. అలా బాలయ్య టీడీపీకి గట్టిగా నిలబడతారు అని అంటున్నారు. అటునుంచి వస్తే ఉమ్మడి క్రిష్ణ, గుంటూరు జిల్లాలకు నారా లోకేష్ ని ముందు పెట్టి కధ నడిపిస్తారు అని అంటున్నారు. ఈ రెండు జిల్లాలలో టీడీపీ సామాజికవర్గం బలం ఉంది.
పైగా ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పురిటిగడ్డగా ఈ కోస్తా నడిబొడ్డు ఉంటుందని భావించాలి. ఇక ఆ ఎన్టీయార్ మనవడు, పైగా తల్లి భువనేశ్వరి పుట్టింటి వారసుడుగా నారా లోకేష్ ఈ రెండు జిల్లాలలో చక్రం తిప్పుతారు అని అంటున్నారు. దాంతో ఈ జిల్లాలలో టీడీపీ పట్టు ఎక్కడా సడలిపోకుండా ఉండేలా సకల జాగ్రత్తలూ ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు.
ఇక మరో సబ్ రీజియన్ గా ఉత్తరాంధ్రా ఉంది. కొత్తగా మరో మూడింటితో కలుపుకుని ఆరు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రా పార్టీ బాధ్యతలు ఆ బరువు అంతా దివంగత నేత, మాజీ ఎంపీ గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు, ప్రస్తుత గీతం విద్యా సంస్థల చైర్మన్ అయిన శ్రీ భరత్ చూసుకుంటారు అని అంటున్నారు. అంటే ఈ జిల్లాలలో ఆర్ధిక భారాలతో పాటు వ్యూహాలు, సామాజిక సమీకరణలు, రాజకీయ ఎత్తుగడలు పై నుంచి వచ్చే ఆదేశాలను పక్కాగా భరత్ అమలు లో పెడతారు అని అంటున్నారు.
గతంలో ఎంవీవీఎస్ మూర్తి ఈ భారాన్ని పూర్తి స్థాయిలో మోసేవారు. ఇపుడు మనవడు భరత్ మీద ఆ బాధ్యతలు పెట్టారు. ఆయన లోకేష్ కి తోడల్లుడు, బాలయ్య చిన్నల్లుడు కావడంతో ఇది కూడా ఫ్యామిలీ ప్యాకేజే అని అంటున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో మిస్ అయినది గోదావరి జిల్లాలు. ఇక్కడ కూడా బాబు ఫ్యామిలీకి చెందిన వారు కానీ దగ్గర వారు కానీ ఉంటే పూర్తి బాధ్యతలు వారికి అప్పగించి కధ నడిపించాలని చూస్తున్నారుట.
ఇలా ఎక్కడికక్కడ భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగితే క్యాడర్ కూడా ఉత్సాహంతో పనిచేస్తుంది అని అంటున్నారు. ఇక రాజమండ్రీ లోక్ సభ సీటు విషయంలో చంద్రబాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్ ని బరిలో దింపుతారు అని అంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా గోదావరి జిల్లాలకు మరో ఫ్యామిలీ మెంబర్ దొరికేసినట్లే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇది చంద్రవ్యూహం. ఇంద్రజాలం, ఒక విధంగా ఈ పద్మవ్యూహం నుంచి వైసీపీ తప్పించుకోవడం అసాధ్యమని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే కనుక టీడీపీ క్యాడర్ ఉరకలు పరుగులు పెడుతూ పనిచేసుకుంటుంది. అదే టైమ్ లో ప్రతీ ఒక్క ఓటూ ఈవీఎం మిషన్లోకి ఎక్కేలా కూడా దగ్గరుండి మరీ చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే బాబా మజాకా అన్న మాటే వస్తోంది. మరి కాసుకో వైసీపీ అని తమ్ముళ్ళు కూడా అంటున్నారు.