Begin typing your search above and press return to search.

ఆళ్ళకు చమట పట్టాల్సిందేనా : మంగళగిరి కోటను లోకేష్ బద్ధలు కొడతారా...?

By:  Tupaki Desk   |   30 July 2022 2:30 AM GMT
ఆళ్ళకు చమట పట్టాల్సిందేనా : మంగళగిరి కోటను లోకేష్  బద్ధలు కొడతారా...?
X
ఏపీలో హాట్ స్పాట్ గా ఉన్న ఒక సీటు పేరు మంగళగిరి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరిలో 2019 ఎన్నికల్లో టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ ఓటమి పాలు అయ్యారు. దాంతో మంగళగిరికి ఎనలేని రాజకీయ ప్రాధాన్యత లభించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ సర్కార్ లోనూ పార్టీలోనూ అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న లోకేష్ ఓటమి అంటే అది టీడీపీ అసలు జీర్ణించుకోలేకపోయింది.

దాంతో మంగళగిరి అంటేనే టీడీపీకి కొన్నాళ్ళ పాటు అదో రకం కలవరం ఉండేది. అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదు. వైసీపీకి కంచుకోటలా ఉన్న మంగళగిరిని మొత్తానికి లోకేష్ బద్ధలు కొట్టబోతున్నాడు అని అంటున్నారు. మంగళగిరిలో లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్కడ పర్యటిస్తున్నారు. జనాలను ఆకట్టుకుంటున్నారు.

దానికి తోడు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ సర్కార్ అనుసరించిన వైఖరి మూలంగా మంగళగిరి మీద ఆ ప్రభావం చాలానే ఉంటుంది అంటున్నారుట. అదే సమయంలో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి అందుబాటులో ఉండడం లేదన్న మాట కూడా ఉంది. ఈ పరిణామాలనీ కలసి లోకేష్ కి ఈసారి రికార్డు స్థాయి మెజారిటీని తీసుకువస్తాయని అంటున్నారుట‌.

ఇక మంగళగిరిలో వైసీపీ సీన్ ఏంటి అన్న దాని మీద ఆ పార్టీ చేయించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. ఇక్కడ వైసీపీకు ఎదురుగాలి వీస్తోంది అని కూడా అంటున్నారుట‌. ఒకనాడు మంగళగిరిలో వెలిగిన వైసీపీకి ఇపుడు వ్యతిరేకత కొట్టొచ్చినట్లుగా ఉందని అంటున్నారుట . గట్టి ఎమ్మెల్యేగా పేరున్న నోరున్న ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి మీద ప్రజలలో ఆదరణ తగ్గుతోంది అని అంటున్నారుట‌.

అదే విధంగా చూస్తే ఆళ్ళ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో దాని మీద కూడా జనాలు గుస్సా అవుతున్నారుట. ఇక ఆళ్ళ ప్రజల నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో తడబడుతున్నారని అంటున్నారుట‌. చెత్త పన్ను మీద ఆళ్ళను మహిళలు నిలదీశారని చెబుతున్నారు. ఇలా గతంలో ఆళ్ళ అంటే ఉన్న క్రేజ్ నెమ్మదిగా తగ్గుతోంది అని వైసీపీ చేయించిన అంతర్గత సర్వేలో తేలింది అంటున్నారుట‌.

ఇక మంగళగిరి అభివృద్ధి విషయంలో ఆళ్ళ దృష్టి పెట్టకపోవడం, మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడడం వంటి వారి వల్ల ఆయనకు ఆదరణ తగ్గిందని జనాలు అనుకుంటున్నారుట. మరో వైపు మంగళగిరి నుంచి ఈసారి గెలవాలన్న లోకేష్ పట్టుదల కూడా టీడీపీ పుంజుకోవడానికి కారణం అవుతోంది అంటున్నారుట. ఆయన ఇప్పటికి రెండు సార్లు నియోజకవర్గంలో పర్యటించి తనదైన శైలిలో జనాలను ఆకట్టుకున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే మంగళగిరి అంటే వైసీపీదే అన్న అంచనాలు ఉన్న చోట ఇపుడు ఇబ్బందులు వస్తున్నాయా అంటే అధికార పార్టీలో మాత్రం చర్చ సాగుతోంది అంటున్నారు.