Begin typing your search above and press return to search.

నారా లోకేష్‌.. ఆచితూచి 'అడుగులు' ..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 12:30 AM GMT
నారా లోకేష్‌..  ఆచితూచి అడుగులు ..!
X
టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. వ‌చ్చే నెల 27వ తేదీ నుంచి పాద‌యాత్ర చేయ‌ను న్న విష‌యం తెలిసిందే. టీడీపీని అధికారంలోకి తీసుకురావ‌డం మాత్ర‌మే దీని వెనుక ఉన్న ఉద్దేశం. లోకేష్‌.. త‌న‌ను తాను ఒక నాయ‌కుడిగా నిరూపించుకునేందుకు చేస్తున్న కీల‌క ప్ర‌య‌త్న‌మనే చెప్పాలి. ఎందుకం టే.. రాజ‌కీయాల్లోకి అడుగులు వేసి.. లోకేష్‌కు 10 సంవ‌త్స‌రాలునిండుతాయి.

2012-13 మ‌ధ్య కాలంలో లోకేష్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు చేసిన వ‌స్తున్నా మీకో సం యాత్ర‌ను హైప్ చేయ‌డంలోను.. యువ‌త‌ను స‌మీక‌రించేందుకు.. ఈ యాత్ర‌ను డిజిట‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసేందుకు నారా లోకేష్ శ్ర‌మించారు. ఇక‌, త‌ర్వాత 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. మొత్తంగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బాగానే క‌ష్ట‌ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు..లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని చేశారు. స‌రే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే కాలం అంతా కూడా పార్టీకి నారా లోకేష్ కీల‌కంగా మార‌నున్నారు. పార్టీ ప‌ద‌వి నుంచి పార్టీని అదికారంలోకి తెచ్చేవ‌ర‌కు ఆయ‌న‌కు తిరుగులేని ప‌ని ఉంది. ఈ నేప‌థ్యంలో ఇటు ప్ర‌జ‌ల‌ను కూడా నారా లోకేష్ ఆక‌ట్టుకోవాలి. ముఖ్యంగా త‌న‌ను తాను నిరూపించుకుని ముందుకు సాగాలి.

ఇలా.. ఒక‌టి కాదు.. రెండు కాదు.. సుమారు ఐదారు ల‌క్ష్యాల‌తో నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. తిరుగులేని నాయ‌కుడిగా నిల‌బ‌డ‌తారు. ముఖ్యంగాపై త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు దీటుగా సమాధానం చెప్పిన‌ట్టు కూడా ఉంటుంది. అందుకే.. ప్ర‌తి విష‌యంలోనూ నారా లోకేష్ ఆచి తూచి అడుగులు వేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ నడుస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.