Begin typing your search above and press return to search.
ఇప్పుడు జగన్‌ను ఏం ప్రశ్నిస్తాం?.. టీడీపీ నేతల అంతర్మథనం
By: Tupaki Desk | 14 July 2022 12:30 AM GMTవ్యూహం వేస్తే.. అది మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉండాలి. ఎత్తు వేస్తే.. ప్రత్యర్థి వర్గం చిత్తయ్యేలా ఉండాలి. ఇదీ .. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా.. అనుసరించాల్సిన వ్యూహం. పైగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల ని.. భావిస్తున్న పార్టీఅయితే.. మరింత వ్యూహాత్మకంగా.. అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలి.
కానీ, ఎందు కో.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ``ఇలా వ్యూహాలు వేయడం.. అలా చేజార్చుకోవడం`` అనే అతి పెద్ద వ్యూహంతో ముందుకు సాగుతోందనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతం టీడీపీ ఒక విషయంలో వైసీపీని సీఎం జగన్‌ను భయంకరంగా ఇరికించేసింది. తన వాదనను ప్రజ ల్లోకి కూడా బలంగా తీసుకువెళ్లింది. అదే.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుగా నిలబడిన ద్రౌపది ముర్ముకు.. ఏ రకంగా మద్దతు ప్రకటించారు? అని! ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకు న్నారా? అవకాశం వచ్చినప్పుడు కేంద్రం మెడలు వంచుతామని..చెప్పుకొన్నారు కదా.. మరి ఇప్పుడు అవకాశం వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకున్నారా? ఒత్తిడి తెచ్చారా? అని టీడీపీ ప్రశ్నించింది.
చంద్రబాబు నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కూడా ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువె ళ్లారు. దీంతో ఈ విషయంపై చర్చ జోరుగానే సాగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు.. జగన్ ప్రత్యేక హోదానో..పోలవరమో.. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధో.. విభజన హామీలనో .. కేంద్రం నుంచి రాబట్టాలని.. కొన్ని వర్గాల ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది. అయితే.. వైసీపీ మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి హామీలు లేకుండా.. వైసీపీ నేతలు ఎలాంటి డిమాండ్లు లేకుండానే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
దీంతో మరోసారి జగన్.. కేంద్రంతో లాలూచీ పడ్డారని.. అవకాశం ఉండి కూడా.. కేంద్రాన్ని ఆయన డిమాం డ్ చేయలేదనే ప్రచారం చేయాలని.. తద్వారా.. జగన్‌ను కడిగేయాలని.. ప్రజల్లో మరింత పలుచన చేయా లని.. టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నారు.
అయితే.. ఇంతలోనే ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. చంద్రబాబు పనిగట్టుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని ఘటన. దీంతో ఆయన ఎందుకు ఇలా మద్దతిచ్చారో. ఎందుకు ఇచ్చారో.. అర్ధం కాకపోగా.. ఇప్పుడు.. జగన్‌ను టార్గెట్ చేయడం ఎలా? అని నాయకులు తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.