Begin typing your search above and press return to search.

తెలంగాణాలో బీజేపీ సరోగసీ గర్భం

By:  Tupaki Desk   |   27 July 2022 1:33 PM GMT
తెలంగాణాలో బీజేపీ సరోగసీ గర్భం
X
తెలంగాణాలో బీజేపీ సంగతేంటి అంటే జవాబు సులువు. ఆరాటమే తప్ప అసలు కధ పెద్దగా లేదనే అంటారు అంతా. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క సీటు. ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలుచుకున్నా కూడా అవి ఆయా అభ్యర్ధుల సొంత టాలెంట్ తప్ప బీజేపీ ఖాతాలోకి ఏ మాత్రం రావు. ఈ నేపధ్యంలో బీజేపీ హడావుడి చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.

తెలంగాణాలో అధికారంలోకి రావాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు సాధించాలి. మరి ఒక్క సీటు గెలిచిన బీజేపీకి సొంతంగా అరవై సీట్లు ఎలా వస్తాయి. పెరిగితే సీట్లూ ఓట్లు వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత పెరగవచ్చేమో కానీ ఏకంగా అధికార పీఠం దక్కుతుందా అన్నదే చర్చగా ఉంది.

ఇక బీజేపీ ఇంతలా హైరానా పడుతున్నా కూడా ఆ పార్టీలో చేరికలు అయితే లేవు. దాంతోనే ఎలా హైప్ తీసుకురావాలో అర్ధం కావడంలేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీజేపీ ఇతర పార్టీల నుంచి ఏ ఒక్కరు చేరినా దాన్ని పూర్తిగా ప్రచారం చేసుకుని అంతా మోడీ చలవ అని చెప్పుకుంటోంది.

బీజేపీకి తెలంగాణా గ్రౌండ్ రియాలిటీస్ అర్ధమవుతున్నా కూడా ఏదో తానూ రేసులో ఉన్నాను అనిపించుకునేందుకు చేస్తున్న ట్రిక్కులు జిమ్మిక్కులూ ఫలించడంలేదు. ఒక ఈటెల రాజెందర్ గెలిచారు అంటే ఆయన రెండు దశాబ్దాలుగా తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమ నేత. మరో వైపు చూస్తే టీయారెస్ అధికారంలోకి వచ్చాక ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా చేశారు. పైగా బీజేపీ నేత.

ఇలా అన్నీ కలిగి ఈటెల గెలిస్తే అది తమ గొప్పతనం అని బీజేపీ ఎలా చెప్పుకోగలదు. ఇక దుబ్బాకలో రఘునందన్ విషయం కూడా అంతే. ఆయన కూడా సొంతంగా సత్తా చాటిన నేతగా ఉన్నారు. ఈ మధ్యనే ప్రధాని మోడీ సభ జరిగింది. సూపర్ హిట్ అన్నారు దానికి ముందు అమిత్ షా వచ్చారు.బంపర్ హిట్ సభ అన్నారు.

ఇలా ఎన్ని చెప్పుకుంటున్నా ఎంతలా హైలెట్ చేసుకుంటున్నా కమలానికి మాత్రం సొంత గర్బం లేకుండా పోయింది అని సెటైర్లు వస్తున్నాయి. అద్దె గర్బం కోసం ఆపసోపాలు పడుతోంది అని అంటున్నారు. దాన్ని చూసి సంతోషించాలని కూడా అంటున్నారు. బీజేపీ సొంతంగా గట్టిగా నిల్బడితేనే తప్ప ఇలా ఎంత కాలం అద్దె గొంతుకలు, అద్దె గర్బాలతో హడావుడి చేస్తుంది అని ప్రశ్నలు వస్తున్నాయి. కమల కుతూహలానికి రాగం తాళం సరిపోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.