Begin typing your search above and press return to search.

టార్గెట్ ఎల‌క్ష‌న్స్‌: బీజేపీ 'పాల‌క్‌' ప‌రుగు.. గేర్ మార్చిన క‌మ‌లం

By:  Tupaki Desk   |   30 Dec 2022 1:30 AM GMT
టార్గెట్ ఎల‌క్ష‌న్స్‌: బీజేపీ పాల‌క్‌ ప‌రుగు.. గేర్ మార్చిన క‌మ‌లం
X
తెలంగాణ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కితీరుతామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న బీజేపీ నేత‌లు.. ఆ దిశ‌గా అడుగులు కాదు.. ప‌రుగులు పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాల‌కు ఇంచార్జ్‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వారిపై మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించేలా పాల‌క్‌(ఆర్ ఎస్ ఎస్ ప‌ద‌జాలం)ల‌ను నియ‌మించింది.

బీజేపీ హైకమాండ్ ప్ర‌త్యేకంగా తెలంగాణ‌పై దృష్టి సారిస్తున్న నేప‌థ్యంలో తాజాగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించింది. వీరిలో సీనియ‌ర్లు.. జూనియ‌ర్లు కూడా ఉన్నారు. గ‌తంలో మంత్రి ప‌ద‌వులు అలంక‌రించిన వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక‌.. పరుగులేనా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏం చేస్తారు?

పాల‌క్‌లుగా నియ‌మితులైన వారు ఏం చేయాలేనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ప్రతీ నెలలో మూడు రోజులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలి. పార్టీ కార్యకర్తల బాగోగులు, ఆర్థిక వనరులు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యత వీరే చూడాలి. పార్టీకి సంబంధించిన ప్ర‌తికార్య‌క్ర‌మానికి దిశానిర్దేశం కూడా చేయాలి.

పాల‌క్‌ల‌లో సీనియ‌ర్లు వీరే..

- కుత్బుల్లాపూర్ - డీకే అరుణ

- ఎల్లారెడ్డి - రఘునందన్ రావు(ఎమ్మెల్యే)

- రామగుండం - కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

- కల్వకుర్తి - రామచంద్రరావు

- వరంగల్ తూర్పు - ఈటల రాజేందర్(ఎమ్మెల్యే)

- ములుగు - సోయం బాపూరావు(ఎంపీ)

- మేడ్చల్ - లక్ష్మణ్

- శేరిలింగంపల్లి - కిషన్ రెడ్డి(కేంద్ర మంత్రి)

- పరిగి - విజయశాంతి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.