Begin typing your search above and press return to search.
బీయారెస్ తరఫున ఆమె చక్రం తిప్పుతారా....?
By: Tupaki Desk | 11 Oct 2022 5:30 PM GMTఆమె ముఖ్యమంత్రి కుమార్తె. దాని కంటే ముందు తెలంగాణా ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన మహిళా నాయకురాలు. ఎంపీగా ఒకసారి గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో పరిచయాలను పెంచుకున ఆమె కల్వకుట్ల కవిత. కేసీయార్ ఏకైక కుమార్తె. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అన్న కేటీయార్ తో పాటే కొనసాగిస్తున్నారు. ఇక ఈ మధ్యనే అంటే దసరా రోజున తన జాతీయ ప్రస్థానాన్ని మొదలెడుతూ బీఎయారెస్ పేరిట పార్టీని స్థాపించిన కేసీయార్ దేశ రాజకీయాల్లో చర్చకు తెర లేపారు.
అయితే బీయారెస్ పార్టీ ప్రకటన వేళ కవిత మిస్ అయ్యారని వార్తలు మీడియాలో జోరుగా వినిపించాయి. దాని మీద ఆమె అన్న మంత్రి కేటీయార్ అసహనం వ్యక్తం చేశారు కూడా. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఈ తరహా ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు కూడా. అయితే కవిత ఎందుకు గైర్ హాజరు అయ్యారు అన్న దాని మీద మాత్రం టీయారెస్ తరఫున వివరణ కానీ సరైన జవాబు కానీ రాలేదు.
దాంతో కవిత అసంతృప్తిగా ఉన్నారని, టీయారెస్ రాజకీయాలలో ఆమె పాత్రను కుదించారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే అవన్నీ తప్పు అని నిరూపించేలా కేసీయార్ యూపీ టూర్ లో ఆయన వెంట కుమార్తె కవిత కనిపించారు. సమాజ్ వాదీ పార్టీ ప్రెసిడెంట్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసీయార్ బీయారెస్ అధినేత హోదాలో వెళ్లారు.
ఆయనతో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీ సంతోష్ తో పాటు కవిత కూడా ఉన్నారు. దీంతో కవిత జాతీయ రాజకీయాల్లో బీయారెస్ తరఫున కీలకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. కేసీయార్ తో పాటు ఆ మధ్య ఢిల్లీ టూర్ లో కూడా ఆమె కనిపించారు.
ఇక చూస్తే ఈసారి పర్యటనలో కూడా కేసీయార్ ఢిల్లీలో నాలుగు రోజుల పాటు బస చేసి జాతీయ నాయకులను కలుస్తారు అని అంటున్నారు. దాంతో తండ్రి వెంట ముఖ్య నేతగా జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏంటో తెలియచేసేలా కవిత ఉంటున్నారని అంటున్నారు. సో కవిత ఇక బీయారెస్ తరఫున చక్రం తిప్పుతారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.