Begin typing your search above and press return to search.
ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో రణం.. ఇక దక్షిణంలో.. అందరికీ సవాలే
By: Tupaki Desk | 5 Aug 2022 1:30 AM GMTకాంగ్రెస్ పార్టీకి, శాసన సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక తప్పదని తేలిపోయింది. ఈ సీటును చేజిక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు
తీవ్రంగా శ్రమించనున్నాయి. దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడంతో కాంగ్రెస్ కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు టీఆర్ఎస్ కు, కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరినందుకు
రాజగోపాల్ రెడ్డి గెలుపు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం. దీంతో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అయితే, ఇక్కడ మరో విషయం కూడా ఉంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక
ఇప్పటివరకు దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, హుజూరాబాద్ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కూ ఎన్నికలు జరిగాయి. నాలుగు అసెంబ్లీ
స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఒక ఎత్తు. ఇప్పడు ఎన్నికలు జరుగనున్న మునుగోడు ఒక ఎత్తు. అన్నిటికి మించి హైదరాబాద్ కార్పొరేషన్, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలు
పూర్తిగా ఉత్తర తెలంగాణలో ఉన్నవి. మునుగోడు మాత్రం దక్షిణ తెలంగాణ పరిధిలోకి రానుంది.
బలం.. బలగం.. పై చేయికి ప్రయత్నం
ఉత్తర తెలంగాణలో ఉద్యమ భావజాలంతో టీఆర్ఎస్, ఇతర కారణాలతో బీజేపీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కూ పట్టుంది. అయితే, దక్షిణ తెలంగాణకు వచ్చేటప్పటికి టీఆర్ఎస్, బీజేపీ కంటే
కాంగ్రెస్ దే ఆధిపత్యం. సంస్థాగతంగా పార్టీ పునాదులు ఈ జిల్లాల్లో బలంగా ఉన్నాయి. నాయకులు కూడా బలమైనవారు ఉన్నారు. అలాంటివాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఉమ్మడి
నల్లగొండ జిల్లా గురించి. కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రస్తుత తరంలో.. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాత తరంలో
బలమైన నాయకులుగా ఉన్నారు. వీరికితోడు వామపక్ష పార్టీలు దక్షిణ తెలంగాణలో ఇంకా ప్రభావవంతంగా ఉండేవి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్ల్లాల్లో వామపక్షాల పాత్ర చాలా కీలకం.
ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలో మునుగోడు ప్రత్యేకంగా నిలవనుంది. ఇక్కడ విజయం సాధించే పార్టీ దక్షిణ తెలంగాణలో పాగాకు ప్రయత్నం చేసే వీలుంది.
ఉమ్మడి నల్లగొండలో మూడో ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడో ఉప ఎన్నిక. 2019లో హుజూర్ నగర్ కు, 2021లో నాగార్జున సాగర్ కు, 2022లో మునుగోడుకు ఉప ఎన్నిక జరుగనుంది.
అంటే మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో మూడో ఉప ఎన్నిక అన్నమాట. హుజూర్ నగర్, సాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాలు వేరు. నల్లగొండ నుంచి
ఎంపీగా ఎన్నికైన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. రెండోసారి టీఆర్ఎస్ దిగ్విజయం సాధించిన అనంతరం
జరిగిన ఈ ఎన్నికలో సహజంగానే ఆ పార్టీ గాలి వీచింది. దీంతో ఉత్తమ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పరాజయం పాలయ్యారు. మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సిట్టింగ్
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో జరిగింది. దీంట్లోనూ ఆయన కుమారుడు సునాయాసంగా నెగ్గారు. ఆ రెండు సందర్భాలు వేర్వేరు.
ఏడాదిలోనే ఎంత మార్పు..?
జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు 2021 ప్రారంభం నుంచి ఏడాదిలోనే చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు తీవ్ర
పరాభవం ఎదురైంది. ఇక్కడ బీజేపీ గెలిచింది అనేకంటే ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారు అనడం సబబు. మరోవైపు 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థి
రఘునందన్ రావు గెలుపొందారనే చెప్పుకోవాలి. ఇక రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ మూడో స్థానం మాత్రమే దక్కుతుందని అంచనాలు వస్తున్న
నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఆ పార్టీకి జీవన్మరణమే కానుంది.
ఎవరికి వారే..
మునుగోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు పెట్టని కోట. సంస్థాగతంగానూ ఆ పార్టీకి మంచి పట్టుంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాల బలాలను ఉపయోగించి
గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ బీజేపీకే పెద్ద సవాల్. ఒకవిధంగా చెప్పాలంటే మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి దక్షిణ తెలంగాణలో ఎంతమేరకు
ముందుకెళ్లగలదు? అని తరచి చూసుకునేందుకు మంచి అవకాశం. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి సంస్థాగతంగా, నాయకత్వపరంగా అంతగా బలం లేదు కాబట్టి.