Begin typing your search above and press return to search.
ఏడేళ్ళు నా కేసీయార్ ని ఏమీ అనలేరా సామీ ...?
By: Tupaki Desk | 11 Nov 2022 2:13 PM GMTఅదేంటో ఏపీలో అధికార పక్షం మీద పెద్ద నోరు చేసుకునే చంద్రబాబు తెలంగాణాలో మాత్రం మెత్తమెత్తగా మాట్లాడుతూంటారు. లేటెస్ట్ గా తెలంగాణా టీడీపీ ప్రెసిడెంట్ పదవిని కాసాని జ్ఞానేశ్వర్ కి ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారం అని ఒక కార్యక్రమం పెట్టుకుని చంద్రబాబు మరోసారి తెలంగాణాలో టీడీపీ గత వైభవం రావడం ఖాయమని చెప్పుకొచ్చారు.
తెలంగాణా అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగింది అని క్లెయిం చేసుకున్నారు. ఐటీ తాను తెచ్చానని, హైటెక్ సిటీ తన ఘనత అంటూ బాబు బాగానే చెప్పుకొచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే మొత్తానికి ఒక గట్టి బీసీ నేత తెలంగాణా టీడీపీకి దొరికారు. ఎన్నికలు చూస్తే ఏడాది కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తామని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి చంద్రబాబు స్పీచ్ మాత్రం చప్ప చప్పగా ఉండడం షాక్ ఇచ్చింది అని అంటున్నారు.
తాను విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ తెచ్చిన కార్యక్రమాలను కేసీయార్ సర్కార్ చక్కగా అమలు చేసిందని బాబు ప్రశంసించారు. ఆ మీదట సొంత డబ్బా కొట్టుకున్నారు. మరి వచ్చిన పార్టీ జనం కానీ మీడియా కానీ మారిన తెలంగాణా రాజకీయ పరిణామాల నేపధ్యంలో బాబు నుంచి ఏదైనా గట్టి పొలిటికల్ మసాలా ఉంటుందని ఆశించినా ఏమీ లేకుండా ముగించేశారు.
నిజానికి తెలంగాణాలో ఇపుడు టీయారెస్ ప్రాభవం తగ్గుతోంది అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అదే టైం లో మళ్ళీ పూర్వం మాదిరిగా అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చేందుకు జనాలు చూస్తున్నారు. తెలంగాణా సెంటిమెంట్ అంటూ గత రెండు ఎన్నికల్లో మొత్తం తెలంగాణా సమాజాన్ని మెస్మరైజ్ చేసిన కేసీయార్ ఈసారి అలా చేయలేరని అంతా అనుకుంటున్న సందర్భం ఉంది.
పైగా టీడీపీ బీసీ నేతని నియమించి తెలంగాణాలో కొత్తగా రాజకీయ కధ నడిపేందుకు సిద్ధపడుతోంది. దీంతో బాబు కూడా ధాటీగా మాట్లాడితే బాగుండేది అని అంతా అంటున్నారు. కేసీయార్ ఎనిమిదేళ్ళ పాలన గురించి విమర్శలు బాబు చేసి ఉంటే అది తెలంగాణాలో టీడీపీ పునరుజ్జీవనానికి ఉపయోగపడేదని కానీ బాబు గారు మాత్రం రాజకీయ విమర్శలే చేయకుండా మమ అనిపించడం పట్లనే తమ్ముళ్లు డౌట్లు పడుతున్నారు.
తనకు ఏపీ బాధ్యతలు ఉండడం వల్ల తెలంగాణాను ఇంతకాలం నిర్లక్ష్యం చేశామని ఇక మీదట అలా సాగదని బాబు చెప్పుకున్నారు. మరి తాను ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గా చోదక శక్తిగా బాబు ఉంటూ తెలంగాణాలో బీసీల పార్టీగా టీడీపీని ముందుకు ఉరికించాల్సిన సందర్భం ఇది. ఇక టీయారెస్ మీద ఎన్నో విమర్శలు చేయవచ్చు. ఒక విధంగా ఆయన మొత్తం పాలనను ఎండగట్టవచ్చు.
అదే విధంగా గత ఎనిమిదేళ్ళలో టీయారెస్ నెరవేర్చని హామీలను కూడా వల్లించవచ్చు. ఒక విధంగా బాబు లాంటి నాయకుడు నోటి వెంట విమర్శలు వస్తే జనాలు ఆ వైపునకు టర్న్ అయ్యేవారు. నమ్మే వారు. కానీ బాబు మాత్రం ఎందుకో కేసీయార్ ని పల్లెత్తు మాట అనకపోవడం చూస్తూంటే 2015 నాటి ఓటుకు నోటు కేసు తరువాత నుంచి ఫుల్ సైలెంట్ గా ఉండడమే అలవాటు చేసుకున్నారా అనిపిస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఇక తెలంగాణాలో టీడీపీ ఏ విధగ్నా ముందుకు సాగుతుంది అన్నది కూడా ప్రశ్నగా ఉంది.
ఎందరు నేతలు ఉనా కూడా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు తెలంగాణాను పాలించారు. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ నూటికి నూరు శాతం తెలంగాణా రాష్ట్రం అందుకుంది. ఇపుడు బాబు వాటిని వల్లించడం ద్వారా టీడీపీ రాజకీయ వాటాను పొందవచ్చు. అక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను వాడుకోవచ్చు. దానికి చంద్రబాబు ఫుల్ ప్రిపేరెడ్ గా ఉంటూ సిద్ధం కావాలి. తన విశ్వరూపం చూపించాలి. అపుడే తెలంగాణాలో సైకిల్ పరుగులు తీస్తుంది అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.