Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు.. కేసీఆర్ ఏం చేస్తారు?
By: Tupaki Desk | 19 July 2022 3:30 AM GMTరంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో సెగలు, పొగలు కక్కుతున్నాయి. వర్గపోరు తీవ్రమైంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో టీఆర్ఎస్ నిండిపోయింది.అనాదిగా టీఆర్ఎస్ లో ఉన్నవారికి ప్రాధాన్యత లేకపోవడంతో వారు అసమ్మతి రాజేస్తున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ పార్టీలో కాక పుట్టిస్తున్నారు.
తాజామంత్రి, మాజీ మంత్రి.. ఇద్దరూ బంధువులే.. దగ్గరి చుట్టరికమే.. కానీ పలకరింపులు లేవు.. కనీసం చూసుకోవడమూ లేదు. టీఆర్ఎస్ లో ఓడిపోయిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, గెలిచి మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా పలకరించుకోకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట..
2014లో తాండూరు నుంచి గెలిచిన మహేందర్ రెడ్డి మంత్రి అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఆయన కీరోల్ పోషించారు. వేగంగా ప్రజల్లోకి వెళుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2019లో ఆయన తాండూరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలిచాడు. అయితే ఇటు రోహిత్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్లు ఎవరూ లేకపోవడం.. మహేశ్వరం నుంచి సబితా కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆమె గులాబీ పార్టీలో చేరి మంత్రి అయ్యారు.
స్వతహాగా బంధువైన సబితా ఇంద్రారెడ్డిని కనీసం పలకరించిన పాపానపోలేదట మహేందర్ రెడ్డి. సబితా రాకతో మహేందర్ రెడ్డి ఉత్సవ విగ్రహంగా మారిపోయారట.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని చేసినా అధికారం మాత్రం అంతా సబిత, రోహిత్ రెడ్డికే కట్టబెట్టిందట..
దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ పోయినసారి చక్రం తిప్పిన మహేందర్ రెడ్డి డమ్మీ అయిపోయారట.. కనీసం తన వారికి కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోయారు. అంతా సబిత, రోహిత్ రెడ్డికే కేటీఆర్ బాధ్యతలు అప్పజెప్పడంతో మౌనం దాల్చారు. అధికారం లేకపోతే ఎలా ఉంటుందో మహేందర్ రెడ్డికి ప్రత్యక్షంగా అర్థమవుతోందట..
మంత్రి సబితారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్పేర్ చెరువులో షాపింక్స్ నిర్మాణంలో సబిత అవినీతిపై కామెంట్స్ చేయడం దుమారం రేపింది. భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇక తాండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక వికారాబాద్ లో వర్గపోరు వీధికెక్కింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వర్గీయులు రోడ్డెక్కి కొట్టుకున్నారు. మహేందర్ రెడ్డి సతీమణి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ సునీతా రెడ్డి ప్రొటోకాల్ పాటించలేదని ఆనంద్ వర్గీయులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. కేటీఆర్ రంగంలోకి దిగాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఇలాంటి విభేదాలు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంచుకోటకు బీటలు వారడం ఖాయమనే అభిప్రాయాలు గులాబీ దళంలో వినిపిస్తున్నాయి.