Begin typing your search above and press return to search.
తగ్గేదేలే.. రాష్ట్రపతి వచ్చినా.. గవర్నర్ గడప తొక్కని కేసీఆర్
By: Tupaki Desk | 26 Dec 2022 4:45 PM GMTపంతం నీదా నాదా సై అంటూ కేసీఆర్ ‘తగ్గేదేలే’ అంటున్నారు. ఎక్కడా తగ్గనంటున్నాడు. పంతానికి బ్రాండ్ అంబాసిడర్ లా మెలుగుతున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు కానీ.. ఆమె గౌరవార్థం మాత్రం గవర్నర్ ఇల్లు అయిన రాజ్ భవన్ లో అడుగు పెట్టలేదు. గవర్నర్ ఇస్తున్న విందుకు మాత్రం హాజరు కాకుండా షాకిచ్చారు.
తెలంగాణకు వేసవి విడిదికి వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్ పోర్టుకు వెళ్లి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసైని నవ్వుతూనే కేసీఆర్ పలకరించారు. అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత గవర్నర్ రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు మాత్రం కేసీఆర్ హాజరుకాకుండా డుమ్మా కొట్టారు.
ఈ విందును గవర్నర్ తమిళిసై ఇస్తున్నారు. కేసీఆర్ ను పిలిచారు. కానీ ఇప్పటికే బీజేపీ అన్నా.. తమిళిసై అన్న మండిపడుతున్న కేసీఆర్ ఆగ్రహంతోనే ఉన్నారు. రాష్ట్రపతి కోసం ఫార్మాలిటీ ప్రకారం ప్రొటోకాల్ తప్పకూడదని వెళ్లి స్వాగతం పలికారు. కానీ గవర్నర్ విందుకు మాత్రం వెళ్లకుండా హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. గవర్నర్ గడప తొక్కకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్ కు దెబ్బతగిలింది. హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ అంశం విందుకు హాజరైతే కేసీఆర్ ముందు ప్రస్తావనకు వస్తుందని.. ఈ కారణంగానే ముభావంగా కేసీఆర్ ఉండిపోయి విందుకు డుమ్మా కొట్టి ఫాంహౌస్ కు వెళ్లిపోయినట్టు తెలిసింది.
సాధారణంగా రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందులో ఎన్ని విభేదాలున్నా సీఎం స్తాయి వ్యక్తులు పాల్గొంటారు. కానీ మన కేసీఆర్ సార్ పంతం పడితే అంతే ఉంటుంది. అందుకే ఆయన నేరుగా పాల్గొనకుండా ఫాంహౌస్ కు వెళ్లిపోయారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.