Begin typing your search above and press return to search.
ఉక్కును తొక్కేయాల్సిందే...అమ్ముడే ఖాయమట...?
By: Tupaki Desk | 3 Aug 2022 12:30 AM GMTవిశాఖ ఉక్కుని అమ్మేస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగిస్తున్న పోరాటాన్ని పెడచెవిన పెట్టిన కేంద్రం ఉక్కు విషయంలో మరో మాట లేదని అంటోంది. కేంద్ర ఆర్ధిక, ఉక్కు మంత్రులు ఇద్దరూ ఇదే తీరున ఉక్కు విషయంలో స్పందించడం విశేషం.
ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మడం కంటే సెయిల్ లో విలీనం చేయడమైనా చేయాలని ఉక్కు ఉద్యోగులు కార్మికులు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు వారి ప్రతిపాదించిన అంశం తన దృష్టిని వచ్చిందని కేంద్ర ఆర్థిక, ఉక్కు మంత్రులిద్దరూ సానుకూలంగా సమాధానమిచ్చారు. అయితే, ఉక్కు వ్యూహాత్మక రంగం కాదని, కాబట్టి ఇతర సీపీఎసీలతో విలీనం గురించి ఆలోచించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి కుండబద్ధలు కొట్టేశారు.
ఇక చూస్తే మూలధనం కోసం పెట్టుబడుల ఉపసంహరణ ఆవశ్యకత ఉందని కూడా కేంద్ర మంత్రి సమాధానమివ్వడం అంటే విశాఖ ఉక్కుని మూడినట్లే. మరో వైపు ఉక్కులో శాశ్వత ఉద్యోగులకు న్యాయం చేసే విషయం దాన్ని కొనుగోలు చేసిన సంస్థలతో చట్టబద్ధమైన ఉద్యోగుల సమస్యలను వాటా కొనుగోలు ఒప్పందం లేదా సంతకం చేయబోయే ఇతర ఒప్పందాలలో తగిన నిబంధనల ద్వారా, తగిన విధంగా సంభావ్య వ్యూహాత్మక కొనుగోలుదారుతో పరిష్కరిస్తామని కేంద్ర ఉక్కు మంత్రి చెబుతున్నారు.
అయితే దీని మీద కేంద్ర మంత్రులకు అనేక ప్రశ్నలు సంధించి రాతపూర్వక సమాధానాలు రాబట్టిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే విన్-విన్ పాలసీ"ని రూపొందించడానికి అన్ని వాటాదారులతో మాట్లాడుతున్నానని అంటున్నారు. అంటే విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయినా కూడా ఉద్యోగులకు ఎంతో కొంత న్యాయం చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత తెర వేయాలని చూస్తున్నాట్లుగా బీజేపీ నేతల మాటల బట్టి అర్ధమవుతోంది.
అంటే విశాఖ ఉక్కు డ్యామ్ ష్యూర్ గా అంగట్లో ఉన్నట్లే. దాన్ని తొక్కేసి చరిత్రలో పెట్టడానికి రంగం సిద్ధమైపోయినట్లే. అమ్ముడుకు కేంద్రం దూకుడుగా అడుగులు వేస్తున్న వేళ మానసికంగా అంతా సిద్ధపడాలా అంటే కేంద్ర జావాబు ఇది. మరి ఏం జరుగుతుందో చూడాలి.